-Advertisement-

Sevalal Maharaj: సంత్ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర..

sevalal maharaj history in telugu sevalal maharaj father name sant sevalal maharaj book sant sevalal maharaj birth place sevalal maharaj birth date
Vaasthava Nestham
బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపూర్‌ జిల్లా రాంజీనాయక్‌ తండాలో జన్మించాడు. అప్పటినుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. జన్మించిన అనంతరం ఈయనకు సేవాలాల్‌ అని నామకరణం చేశారు. సేవాలాల్‌ Sevalal Maharaj పెరిగిన కొన్ని రోజుల తర్వాత కొంతకాలం పాటు మేరమ్మగా పిలువబడే జగదాంబ దేవి ప్రత్యక్షమై సేవాలాల్‌ని నాకు అప్పజెప్పమని భీమనాయక్‌ను అడుగుతుంది. కానీ అమ్మ వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం, మాట ప్రకారం  సేవాలాల్‌ అందుకు ఒప్పుకోడు. తల్లిదండ్రులు సేవాలాల్‌ను అమ్మవారికి అప్పగిస్తుంటే నేను శాఖాహారిని జగదాంబ మాంసాహారి కనుక ఆమెకు నేను ఎలాంటి జీవాలను బలి ఇవ్వదలచుకోవడం లేదు అని అంటాడు. అప్పుడు మేరమ్మ సేవాలాల్‌కు ఎన్నో కష్టాలకు, ఎన్నో సమస్యలకు గురి చేస్తుంది. అయిన కూడా సేవాలాల్‌ చలించడు, భయపడడు. చివరకు సేవాలాల్ మహారాజ్ నివసిస్తున్న తండాలను, కష్టాల పాలు చేస్తుంది. ఇదంతా సేవాలాల్‌ కారణంగా జరుగుతుందని తండా ప్రజలు, తండా నుండి ఆయనను బహిష్కరిస్తారు. కానీ అమ్మవారికి మేకలను బలి ఇవ్వకుండ అమ్మవారు శాంతిస్తారని ప్రజలు నమ్ముతారు. వారి కోరిక మేరకు సాతీ భావానీలకు మేకపోతు బలి ఇవ్వడానికి నిశ్చయించుకుంటారు. ఏడు మేకలను ఏడుగురు అమ్మవారుల ముందు ఉంచుతారు. Sevalal jayanti February 15 కాని సేవాలాల్‌ ప్రజల మూఢనమ్మకాలను నమ్మాడు. ఎందుకంటే ఆయన అమాయక ముగ జీవుల్ని బలిచేస్తుంటే చూడలేక, తట్టుకోలేక ఒకవేళ అమ్మవారికి బలే ఇష్టమైతే నేనే బలైపోతానని సేవాలాల్‌ ప్రజల సమక్షంలో తన తలను ఖండించుకొని అమ్మవారి కాళ్ల దగ్గర పడేస్తారు. నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు banjara వరాలు ఇచ్చి ఆదుకోమని దేవిని ప్రార్థిస్తాడు. అమ్మవారు తమ మహిమతో సేవాలాల్‌ శిరస్సును తిరిగి అతని శరీరానికి జోడించి జీవం పోస్తుంది. ఇన్నాళ్లు నేను పెట్టే పరీక్షలో సేవాలాల్‌ గెలిచాడని, నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు అయిన ఇతని నాయకత్వంలో ప్రయణించండని జగదాంబ ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి సేవాలాల్‌ జగదాంబమాతనే తన మార్గదర్శకురాలిగా, గురువుగా స్వీకరించి అన్ని విద్యలను నేర్చుకొని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు. బంజారాల అభివృద్ధి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆరు నెలల ప్రాయంలోనే సేవాలాల్‌ కొండపైన చాముండేశ్వరీ దేవతా మూర్తులతో ఆటలు ఆడుకునేవాడు. సేవాలాల్‌- చాముండేశ్వరి అమ్మవారు ఆటలు ఆడడం రహస్యంగా భీమా నాయక్‌ గమనించి విచారిస్తే ప్రతిదినం అలాగే అడుకుంటామన్నాడు. పెరిగి పెద్దవాడైన సేవాలాల్‌ ఆవులు కాసేవాడు. తల్లిసద్ది కట్టిస్టే అది ఎవరికో ఇచ్చి ఆవుల వెంట అడవులోనికి పోయేవాడు. ఒక బంకమట్టితో రొట్టెలు చేసి తినేవాడు. ఈ విచిత్ర ప్రవర్తన తల్లితండ్రులకు తండాలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది. దీంతో సేవాలాల్ మహారాజ్ ఎన్నో మహిమలు కలవాడు అని తండా ప్రజలు నమ్మేవారు.

సంత్ సేవాలాల్ మహారాజ్ చేసిన ఉద్యమాలు..


ఈ సమస్త జీవకోటికి మాతృరూపం (తల్లిగా) వెలిసిన అమ్మభవాని గురించి అమ్మను పూజించాలని, కాని ఫలితం ఆశించవద్దని సేవాలాల్ మహారాజ్
బంజారాలకు బోధించారు. సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌గారు, అహింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శపురుసుడయ్యారు. Sevalal Maharaj సేవాలాల్‌ మహరాజ్‌ ఆనాడు బంజార జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు. ఇదే సిద్ధాంతాన్ని అందరూ ఆచరించాలన్నారు. బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్‌ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో బ్రిటిష్‌, పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయ్యింది. ఈ పరిస్థితులలో బంజారా జాతిని సన్మర్గంలో నడిపించేంందుకు సేవాలాల్‌ మహారాజ్‌ Sevalal Maharaj అవతరించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మంచి మార్గంలో బంజారాలను నడుస్తున్నారు.
Comments
 -Advertisement-