-Advertisement-

Ratha saptami 2024: రథసప్తమి విశిష్టత, నదీస్నానం.. సూర్య భగవానుడి ఫూజా విధానం.!!

ratha saptami 2024 slokam ratha saptami 2024 in tamil ratha saptami 2024 in marathi ratha saptami 2024 mantra Ratha saptami 2024 pooja vidhanam ratha
Vaasthava Nestham
అత్యంత నియమ నిష్ఠలతో శుక్ల పక్షంలోని ఏడవ రోజు సప్తమి తిథిని రథ సప్తమిగా జరుపుకుంటారు. రథసప్తమి సందర్భంగా సూర్య భగవానున్ని పూజిస్తారు. రథసప్తమి నాడు సూర్యభగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలు పెట్టాడు. కనుక దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 16వ తేదీన వస్తుంది. రథసప్తమి రోజు సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తాడని చాలామంది బాగా నమ్ముతారు. సూర్యుడు దయ ఉంటేనే ఆరోగ్యంగా జీవించగలుగుతాం.Ratha saptami pooja vidhanam ఇక అటువంటి సూర్య జయంతి నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, రోగాలు, బాధల నుండి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. Ratha saptami pooja vidhanam అందుకే అత్యంత నియమనిష్టలతో రథసప్తమి నిర్వహిస్తారు. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 15వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు మొదలై 16వ తేదీ ఉదయం 8;54 నిమిషాలకు ముగుస్తుంది. సహజంగా దృక్ పంచాంగం ప్రకారం ఉదయం తిథిని ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమిగా జరుపుకోనున్నారు.

రథసప్తమి విశిష్టత, నదీస్నానం..


రథ సప్తమి నాడు నదీ స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. ఈ నమ్మకం కారణంగానే రథసప్తమి ని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. రథసప్తమి స్నానాన్ని ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం నాడు ఆచరించవలసి ఉంది. Ratha saptami ఎవరికైనా పవిత్ర నదులలో స్నానం చేయటం సాధ్యం కాకుంటే గంగాజలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకుని చేసినా ఫలితం ఉంటుంది.
రథ సప్తమి నాడు సూర్యభగవానుడిని పూజించవలసిన విధానం విషయానికి వస్తే రథసప్తమి రోజున సూర్యోదయం సమయంలో స్నానం ఆచరించి సూర్యుడికి అభిముఖంగా నిలబడి, అర్ఘ్యం సమర్పించి నమస్కరిస్తారు. అనంతరం నెయ్యి దీపం వెలిగించి ఎర్రటి పువ్వులను సమర్పించి పూజలు చేస్తారు. ఈ విధంగా సూర్యుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి రథసప్తమి సరైన సమయమని ఇంట్లో సూర్య యంత్రాన్ని స్థాపించి పూజలు నిర్వహించుకోవచ్చు అని చెబుతున్నారు. నీళ్లలో ఎర్రచందనాన్ని, బెల్లాన్ని, ఎర్రటి పువ్వులను వేసి, సూర్యుడికి సమర్పిస్తే, ఆదిత్య హృదయాన్ని పఠిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుందని చెబుతున్నారు.
Comments
 -Advertisement-