-Advertisement-

Ratha Saptami: రథసప్తమి రోజు ఏం చేస్తారంటే..

ratha saptami significance ratha saptami 2024 ratha saptami story ratha saptami telugu ratha saptami 2024 in tirumala baby born on ratha saptami
Vaasthava Nestham
సూర్యుడుదయించే తూర్పు దిక్కు అస్తమించే పడమటి దిక్కు రెండూ వందనీయాలు. అనివార్యమైన జీవుడి జనన మరణాలకు అవి సంకేతాలు కోటి సూర్యమండల మధ్యస్థమైన మహాత్రిపురసుందరీదేవి తన మూల స్థానాన్ని సూర్యుడియందే నిలుపుకున్నది. అంటే సౌరశక్తి అనంతశక్తి భాండాగారం, ఇంతటి పౌరాణిక, వైజ్ఞాజనిక ప్రాభవంతో వెలుగుతూ సృష్టి మొత్తాన్ని వెలిగించేది. కనుకనే రథసప్తమి సప్తమి పర్వదినమైంది. 
మాఘ సప్తమి తిథి నుండి సూర్య కిరణాలు వేడిని, వెలుగును, శక్తినీ, ధాతుపుష్టినీ మరింత సమృద్ధం చేసుకొని ప్రకృతికి పచ్చదనాన్ని, జీవులకు అంతరంగ దర్శనాన్ని వైజ్ఞానికులకు అన్వేషణా తీవ్రతను జాతి, మత, వర్గ, వర్ణనాతీతమైన స్థాయిలో ప్రసరించే రథసప్తమి, Ratha Saptami సూర్యోపాసనలో ఒక మహత్తరమైన భూమిక, ఈ క్షణం నుండీ జీవుడి ప్రయాణాన్ని వడి వడిగా సాగించే మహాబోధక శక్తి అనుభవమౌతుంది. అవిద్య, అనాచారం, అస్పష్టత, అహంకారం అనబడే చీకటిని నశింపజేసే వినాశక శక్తీ, దేహ, మనో బుద్ధులను వికాసమానం చేయగల శక్తి సూర్య కిరణాలలో ఉన్నాయి. తన శక్తి ద్వారా సృష్టికి మంగళాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఆయనకు శంభువని పేరు. పాప, శాప, తాపాల వలననే మానవ జన్మ కలుగుతుంది. కనుక 'ర'కారం రవి బీజంగా 'అ'కారం అగ్ని బీజంగా 'మ'కారం చంద్ర బీజంగా, "రామ" శబ్దం ఏర్పడింది. (Ratha Saptami) రాముడు జన్మెత్తిన వంశం సూర్యవంశం. రావణవధకు ముందు అగస్త్యుల వారు శ్రీరామ చంద్రుడికి ఉపదేశించినది ఆదిత్య హృదయం. అదంతా సూర్య ఉపాసనా మంత్రం. ఇంతటి మహాశక్తి మండల శాసన కర్త రథానికి సారథి అనూరుడు. ఊరువులు లేనివాడు. కదిలించే సూర్యదేవుడికి, కదలలేని అనూరుడు రథసారథి. జీవితంలో యిమిడిన వైరుధ్యమిదే. నకలాంగులూ తాము నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని అలక్ష్యం చేస్తూ జీవితాన్ని చెల్లగొట్టుకుంటే వారే అసలు వికలాంగులు. రథసప్తమి జాతిని శక్తిమంతం కమ్మంటుందని ఆధ్యాత్మిక శాస్త్రవేత్త Ratha Saptami రథసప్తమి, శాస్త్రీయ దృక్పథం అని వి.యస్.ఆర్. మూర్తి తన రచనలో పొందు పరిచారు. విధంగా "రథసప్తమి పర్వదినాన, నిజానికి జీవిత కాలమంతా సూర్యుణ్ణి చూడకుండా గడిపినందున ఆనాటి శరీరం అందుకోవలసిన సూర్యశక్తిని అందుకోలేదు. కనుక సౌర చైతన్య శక్తి లభించని కారణంగా, పుష్టి లేని అంగాలతో ఈ జన్మ ఎత్తాడు." అన్నాడు ముని. అనగనగ ఒక రాజు, ఆ రాజుకు కలగక కలగక ఒక కుమారుడు కలిగాడు. కానీ అతడు వికలాంగుడు. రాజుకు ఆనందం మహాదుఃఖం ఏకకాలంలో కలిగి ఏం చేస్తే కొడుకు ఈ వైకల్యం నుండి బయట పడతాడో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో ఒక మునిని కలుసుకునానడు. తన సమస్యను విన్నవించుకున్నాడు. ఆయన తన దివ్యశక్తితో తెలుసుకొని చెప్పాడు రాజుకు. "మహానుభావా! పరిష్కార మార్గ నిర్దేశనంగా దొరికింది. సూర్యోపాసనావిధిని నిర్వర్తించి, నాకుమారుడిని ఈ యాతన నుండి తప్పించి, రాజ్యానికి ఉత్తమ వారసుణ్ణి అందిస్తాను. ధన్యుణ్ణి!" అంటూ రాజు కర్తవ్యోన్ముఖుడైనాడు. వైజ్ఞానిక దృక్పథంలో ఈ కథను అన్వయించుకున్నపుడు శరీరానికి, ప్రకృతికి, పంచభూతాలకు, అంతెందుకు సర్వసృష్టికి సౌరశక్తి మూలమైన సూర్యుడిశక్తి ఏమిటి? దీనిని విడమరచి చెప్పేది రథసప్తమి. ఈసారి ఫిబ్రవరి 19న వస్తుంది. సూర్య, సవిత, రవి, అర్క, భాస్కర, భాను, దివాకర, ఆదిత్య వంటి అనేక నామాలతో సూర్యుడు అందరికీ పరిచయమే. ఇవికాక మరికొన్ని పేర్లు సూర్యుడి కర్మ నిష్టను అనుసరించి ఏర్పడ్డాయి. వెలుగునే చైతన్యాన్ని, నిరంతరం ప్రసరిస్తాడు. కనుక సవిత, ఎవరూ చొరబడలేని చోటికి చొచ్చుకుని వెళ్తాడు. కనుక సూర్యుడు, శూన్య గగనంలో ప్రయాణిస్తాడు. కనుక ఖగ, చైతన్య శక్తిని అమృతప్రాయంగా అందరికీ పంచుతాడు. కనుక వూషకోటాను కోట్ల కిరణాలను ధరిస్తాడు. కనుక గఛస్తి మంతుడు, బంగారువర్ణపు తొలివర్ణం. నెమ్మదిగా పచ్చనై, ఆపై తెల్లనై, మెల్లగా కెంజాయగా మారుతూ, పగటిని వెలిగిస్తుంది. కనుక స్వర్ణరేతస్క్రుడు. ఇవన్నీ సూర్యుడి కలాపాన్ని సూచించే పేర్లు, సూర్యుడి రథాన్ని గేయచకమంటుంది లలితా సహస్రనాయం. (Ratha Saptami) ఆ రథాన్ని నడిపించే గుర్రాలు ఆకుపచ్చ వర్ణంలో వుంటాయి. ఆ గుర్రాలకు సప్త అనే పేరు ప్రతి సూర్యకిరణంలో ఏడు రంగులు యిమిడి వున్నాయి. నిజానికి ఆ ఏడు రంగులూ, ఏడుగురు మహోన్నత సూర్యారాధకులైన వ్యక్తులు. అందులో విశ్వామిత్రుడు ఒకరు. భూమిలో మొదలయ్యే ఏడు లోకాలకు సూర్యకాంతి రథసప్తమినాడు దేదీప్యంగా అందుతుంది. నిశ్శబ్దం నుండి శబ్దం పుట్టినట్లు శూన్యం నుండి పుడతాయి. కనుక సూర్యకిరణాలకు మారీచులని పేరు. ఒక కొయ్యను వడ్రంగి ఏ విధంగా అందమైన బొమ్మగా తీర్న్ దిద్దుతాడో ఆ విధంగానే సూర్యుడు సర్వసృష్టికి ప్రాణశక్తిని, రూప లావణ్యాలను, పుష్టినీ సమకూరుస్తాడు. కనుక సూర్యుడికి త్వష్ట అని పేరు. అంటే వడ్రంగి అని అర్ధం. కాలాన్ని, పగలు-రాత్రులు, తిథులను, మాసాలను, రుతువులను, అయనాలను, సంవత్సరాలను చైతన్యాకృతులుగా తీర్చిదిద్ది, అనుభవ రసం సిద్ధం చేస్తాడు. సూర్యుడు వేదనాదం నభోమండలం నుండి భూమండలం చేరటం వెనుక, మేఘాల అందాలను యినుమడిస్తూ మెరిసే మెరుపుల వెనుక, జలధారతో స్నేహం వెనుక వున్నదంతా సూర్య చలనమే. Ratha Saptami మహాగగనానికి తానొక్కడే చక్రవర్తి. కనుక సూర్యుడికి వ్యోమనాథుడని పేరు. ఊహను నిజం చేస్తున్నట్టుంటాడు. కనుక ఆయనకు కవి అని పేరు. అందుకే రవిగా అన్నీ చూడలేకపోయినా, కవిగా అన్నీ చూస్తాడని లోకోక్తి, గ్రహతారక గణాన్ని క్రమంగా నడిపించేది సూర్యుడే, విష్ణువువలె సూర్యుడు సర్వవ్యాపి. వేద పఠనానికి, క్రతువులకు జీవకోటికి కార్యకలాపాలకు ఆయన కర్మసాక్షిని ఆధ్యాత్మిక పెద్దలు ఉపదేశిస్తున్నారు. 

- కొలనుపాక కుమారస్వామి, వరంగల్..✍🏼


Comments
 -Advertisement-