-Advertisement-

ఎండ తీవ్రతకు బిహార్'లో 20 మంది మృతి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: తీవ్ర ఉష్ణోగ్రతలకు తాళలేక ఉత్తరాది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్'లో బుధవారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, వేడి సంబంధ సమస్యలతో జిల్లా ఆస్పత్రిలో 2 గంటల వ్యవధిలో 16 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో వడగాలులకు మరో 19 మంది చనిపోయారు. ఎండలకు ఢిల్లీలో ఓ వ్యక్తికి అసాధారణ స్థాయిలో 108 డిగ్రీల సెల్సియన్ జ్వరం వచ్చింది. కిడ్నీలు, కాలేయం విఫలమై అతను చనిపోయారు.
Comments
 -Advertisement-