-Advertisement-

Transgenders Casted vote: మేము ఓటు వేసాము మీరు కూడా వేయండి.. ఓటు వేసినా ట్రాన్స్ జెండర్లు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: పట్టణ కేంద్రంతోపాటు ఉట్నూర్, పిట్టల వాడ, రాంనగర్, కే.ఆర్.కే కాలనీలో ట్రాన్స్ జెండర్లు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.(Transgenders Casted vote) ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు వేసి అభివృద్ధికి నాంది పలుకాలన్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద సిరా చుక్క వేలును చూపిస్తూ సెల్ఫీలు దిగారు. ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

బోథ్ నియోజకవర్గంలో అధిక శాతం ఓటింగ్..

ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియగించుకున్న వారి శాతం 
ఐదు గంటల వరకు అన్ని నియోజకవర్గాల వారీగా కలుపుకొని 69.81% ఉండగా, బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా 74.8% నమోదు అయ్యింది. ఆసిఫాబాద్ నియోజక వర్గం తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ వేయడానికి సాయంత్రము 6 గంటల వరకు సమయం ఉంది.
Comments
 -Advertisement-