-Advertisement-

అది.. మేలిమి బంగారమేనా...?

Vaasthava Nestham

- మార్కెట్ ధర కంటే తక్కువకే..?
- నిజామాబాద్ జిల్లా నుండి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ కు సరఫరా 
- బంగారం అక్రమ వ్యాపారాన్ని లీక్ చేసిన మధ్యవర్తి..?
- హాట్ టాపిక్'గా మారిన బోథ్ లోని కొందరు వ్యాపారుల పంచాయితీ
- అధికారులు విచారణ చేపడితే బయటపడనున్న విస్తుపోయే నిజాలు 


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: అది ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గ కేంద్రం... వారందరూ ఆర్థికంగా బలమైన వాళ్లే... వారందరూ ఒక గ్యాంగ్ ఏర్పడి గత కొన్ని ఏళ్ల నుండి తక్కువకు బంగారం కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని ఇటీవల ఆ వ్యాపారస్తుల మధ్య పంపకాల విషయంలో జరిగిన పంచాయితీతో విషయం ఆ నోట ఈ నోట బయటకు పొక్కింది. ఈ విషయం తెలిసి ప్రజలు అవాక్కైతున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి బోథ్ మండల కేంద్రానికి చెందిన కొంతమంది వ్యక్తులు, వ్యాపారులు మార్కెట్ ధర కంటే బంగారాన్ని (తులానికి) 15 నుండి 20 వేల వరకు తప్పక కొనుగోలు చేస్తున్నారు. గత కొన్ని ఏళ్ల నుండి ఈ వ్యవహారం బయటకు పడకపోవడం, అధికారులకు తెలియకపోవడం లేదా అధికారులకు తెలిసినా కూడా సైలెంట్ గా సైడ్ అయ్యారా అనే...?? అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో దొరికే బంగారం కంటే ఈ వ్యాపారులకు 15 నుండి 20 వేలకు తక్కువ కొనుగోలు చేసి, కొందరు గోల్డ్ స్వీత్'ల సహాయంతో ప్రజలకు విక్రయించారని వాదనలు వినిపిస్తున్నాయి. ఆ వ్యాపారులు కొనుగోలు చేసిన బంగారం మేలిమి బంగారమేనా..? అనే చర్చ జరుగుతోంది. లేదా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారా..?? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనాప్పటికీ అధికారులు క్షున్నమైన విచారణ చేపడితే విస్తుబోయే నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
Comments
 -Advertisement-