-Advertisement-

అడేగామ(బీ) శివారంలో అక్రమ వెంచర్..!?

Vaasthava Nestham

- అనుమతులు నిల్... అమ్మకాలు ఫుల్..!?
- కొనుగోలుదారులకు మోసం చేస్తున్న రియాల్టర్, మధ్య దళారులు


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రం గుండా వెళ్ళే జాతీయ రహదారి-44 కు సమీపంలో ఓ అక్రమ వెంచర్ పుట్టుకొచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ భూమిని కొనుగులు చేసి, ప్లాట్లుగా మారుస్తూ రియల్టర్, దళారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కొనుగోలుదారులకు ప్లాట్లు అంటగడుతూ మోసాలకు గురి చేస్తున్నారు. నాలా (నాన్‌ అగ్రికల్చరల్‌ లాండ్స్‌ అసెస్‌మెంట్‌ యాక్ట్‌) చట్టం-2006 ప్రకారం కన్వర్షన్‌ చేసారు. కానీ గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కన్వర్షన్‌ అనంతరం భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించాలంటే డీటీసీపీ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) అనుమతి తప్పనిసరి.
Vaasthava Nestham Telugu Daily

డీటీసీపీ అనుమతులు తీసుకోకుండానే కేవలం నాల కన్వర్షన్ చేసి ప్లాట్లుగా విక్రయిస్తు ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. గ్రామ పంచాయతీ, డిటిసీపి అనుమతులు లేకుండా విక్రయిస్తూ కొనుగోలుదారులకు నిండా మోసాలకు గురి చేస్తున్నారు. ఈ వెంచర్‌లో నిర్వాహకులు ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడం లేదు.. ఇలా అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసిన వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసే కొనుగోలుదారులకు భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.

Comments
 -Advertisement-