-Advertisement-

సర్పంచ్‍ల పదవీకాలం మరో 24 రోజులే...!

Vaasthava Nestham
- తాము చేసిన అభివృద్ధి పనుల బిల్లు రాలేదని సర్పంచుల ఆందోళన
- రూ.300 కోట్లకుపైగా పెండింగ్ బిల్లులు..?

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ల పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. సర్పుంచ్ ల పదవీ కాలం కేవలం 24 రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా..? లేదా ఎంపీ ఎన్నికల అనంతరం సర్పంచుల ఎన్నికల నిర్వహిస్తారా..? అన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికల జరిగితే కొత్త సర్పంచ్ లు వస్తారు లేకుంటే, కార్యదర్శులు ఇంఛార్జీలు గా వ్యవహరిస్తారు. చాలా మంది సర్పంచులకు చేసిన అభివృద్ధి పనుల బిల్లులు ఇంకా రాలేదు. తమ పదవీ కాలం కొద్ది రోజుల్లో ముగుస్తుండడంతో వారు బిల్లులపై ఆందోళన చెందుతున్నారు. కేంద్రం నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులు గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు, ఖర్చులకే సరిపోతున్నాయని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం నుంచే సర్పంచులకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. గతంలో బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చూశాం. ఈ నేపథ్యంలో తమకు బిల్లులు చెల్లించాలని వారు కోరుతున్నారు.


రూ.300 కోట్లకుపైగా పెండింగ్ బిల్లులు..?


రాష్ట్రంలో ఒక్కో సర్పంచ్ కు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలకుపైగా బిల్లులు రావాల్సి ఉందని చెబుతున్నారు. మొత్తంగా రూ.300 కోట్లకుపైగా పెండింగ్ బిల్లులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులను అధికారులు సర్పంచలపై ఒత్తిడి తెచ్చి మరి నిర్మింపజేసారు. ఒక్కో రైతు వేదికను రూ.22 లక్షల అంచనా వ్యయంతో నిర్మించగా.. ఇందులో రూ.12 లక్షలు ఉపాధి హామీ నిధుల నుంచి ఖర్చు చేయగా, మిగతా రూ.10 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఉపాధి హామీ నిధులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మాత్రం రాలేదు. సర్పంచుల్లో ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. అయినా వారికి బిల్లులు రాలేదు. ఇప్పుడొచ్చిన కొత్త ప్రభుత్వం తాము చేసిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించాలని సర్పంచులు కోరుతున్నారు.
Comments
User
Comment Poster
తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు మా సర్పంచుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే మా గ్రామపంచాయతీ అది వెంకటాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీకి అభివృద్ధి చేసిన బిల్లులు 16 లక్షలు రావాలి అందుకని నాలుగు నెలలు సర్పంచ్ల కాలము ఎంచగలవు
Replied
ఉద్యమం చెయ్యండి...
User
Replied
Brs West
 -Advertisement-