-Advertisement-

ఆర్టీసీ డిపోలో కోడి వేలం పాట

Vaasthava Nestham

- ఆసక్తిగా మారనున్న పందెంకోడి వేలం


వాస్తవ నేస్తం,కరీంనగర్: ఆర్టీసీ అధికారులు కోడిని వేలం వెయ్యడానికి సిద్ధమవుతున్నారు.. ఇదేంటి అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా..?? అయితే ఇది మొత్తం చదవండి... ఈనెల తొమ్మిదో తేదీన గుర్తు తెలియని ప్రయాణికుడు పందెంకోడి ని బస్సులో మర్చిపోయాడు. దానిని తీసుకోవడానికి గత మూడు రోజులుగా ఎవరూ రాలేదు. దీంతో అధికారులు పందెం కోడిని వేలం వేయడానికి తేదీ ఖరారు చేశారు. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం డిపో కార్యాలయంలో బహిరంగ వేలం వేసేందుకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు ఈ వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 9న వరంగల్ (Warangal)నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada)వెళ్తున్న బస్సు కరీంనగర్ Karimnagar బస్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో పందెం కోడిని తన వెంట తీసుకు వెళ్తున్న ప్రయాణికుడు దానిని బస్సులోనే మరిచి వెళ్లి పోయాడు. బస్సులో బ్యాగ్ గమనించిన సహచర ప్రయాణికులు విషయాన్ని కంట్రోలర్ దృష్టికి తెచ్చారు. అందులో ఏముందో పరిశీలించేందుకు ఆర్టీసీ సిబ్బంది దానిని తెరిచి చూడగా, భద్రంగా ప్యాక్ చేసి ఉన్న పందెంకోడి కనపడింది. దీంతో దాన్ని సంరక్షించేందుకు ఆర్టీసీ సిబ్బంది TS RTC కరీనంగర్‌-2 డిపోకు తరలించారు. మూడు రోజులుగా సిబ్బంది అటు ఆర్టీసీ బస్సులతో పాటు పందెపుకోడి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. దానిని తీసుకు వెళ్లేందుకు యజమాని వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో ఈరోజు(Friday) వేలానికి ముహూర్తం నిర్ణయించారు.

Comments
 -Advertisement-