ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ collector Rahul Raj అన్నారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని National voters day పురస్కరించుకొని గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి Adilabad SP Gouse Alam జిల్లా ఎస్పీ గౌస్ అలాం తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్ల దినోత్సవం సందర్బంగా తీసుకొస్తున్న మార్పులు, సంస్కరణలు, ఓటు హక్కు, దాని ప్రాధాన్యత అంశాలపై వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా రంగోలి పోటీలు, నూతన ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ, సీనియర్ సిటిజన్ల కు సన్మానం, పాఠశాలలు, కళాశాల స్థాయిలోని పిల్లలకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు వంటి కార్యక్రమాలను నిర్వహించి అవగాహన కల్పించారు. వృద్దులకు, దివ్యాంగ ఓటర్లకు ఇంటి దగ్గరికి వెళ్లి ఓటు వేసే విధంగా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అనంతరం ఓటు హక్కు పై కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత, విద్యార్థులు ఓటు ప్రాధాన్యతపై అవగాహన ప్రదర్శనలు ఆహ్వానితులను అలరించాయి. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లను శాలువా తో సన్మానించారు. ఓటరు అవగాహనపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. అంతకుముందు స్థానిక ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో ఓటు హక్కు వినియోగం, నమోదుపై నిర్వహించిన బైక్ ర్యాలీని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి జెండా ఊపి ప్రారంభించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టర్ చౌక్, తెలంగాణ చౌక్, వినాయక్ చౌక్, నేతాజీ చౌక్, పంజాబ్ చౌక్ మీదుగా జడ్పీ కార్యాలయ సమావేశ మందిరం వరకు సాగిన బైక్ ర్యాలీలో కలెక్టర్, ఎస్పీ, అటవీ అధికారి, పోలీస్, ఎన్.సీ.సీ, వివిధ వర్గాల ప్రజలు, అధికారులు, యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ ఇ.విష్ణువర్ధన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, జిల్లా అధికారులు, పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Comments