విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగాలలో రాణించాలి
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఉట్నూర్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగాలలో రాణించాలని స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. బుధవారం ఉట్నూర్ లోని కేబి కాంప్లెక్స్ క్రీడా మైదానంలో ఐటిడిఎ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ సభ్యులు సోయం బాపూరావు, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వెంకట్ నరసింహారెడ్డి, సోషల్ వెల్ఫేర్ కార్యదర్శి నవీన్ నికోలస్, జిల్లా ఎస్పీ గౌస్ ఆలమ్, పిఓ చాహత్ బాజ్ పాయ్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా క్రీడా జ్యోతితో కార్యక్రమాన్ని ప్రారంభించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అతిథులు విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్బంగా ఖానాపూర్ ఎమ్మెల్యే Mla vedama bojju మాట్లాడుతూ...
రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు క్రీడా రంగాలలో రాణిస్తూ, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా రంగాలలో రాణించి పథకాలు సాధించాలని అన్నారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఆటలతో పాటు చదువులోను రాణించి పాఠశాలలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు.
ఎంపీ సోయం బాపూరావు MP soyam Bapurao మాట్లాడుతూ...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించడంతో క్రీడాకారులు ఒలంపిక్స్, ఆసియన్ వంటి గేమ్ లలో 200 పైగా పథకాలు సాధించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్రాలలో ఖేలో ఇండియా వంటి పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. విద్యార్థులు క్రీడలలో రాణించేందుకు అవసరమైన వసతులు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ..
7వ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ లో పాల్గొంటున్న seventh inter society sports league విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1022 గురుకుల విద్యాసంస్థలలో విద్యనభ్యసిస్తూ 5 వేల మంది వివిధ క్రీడా పోటీలలో పాల్గొంటున్నారని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు వికాసం, ఆరోగ్యం కోసం ఇలాంటి స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు భోజన వస్తతులు కలిపిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
సోషల్ వెల్ఫేర్ కార్యదర్శి మాట్లాడుతూ..
రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి, నీట్ లలో ర్యాంక్ లు సాధిస్తున్నారని, అలాగే క్రీడలలో జాతీయ స్థాయిలో రాణిస్తూ దేశానికి, రాష్ట్రానికి గుర్తింపు తీసుకువస్తున్నారని అన్నారు. విద్యార్థులు క్రీడలలో రాణించేందుకు మెనూ ప్రకారం భోజనం అందిస్తూ, ప్రత్యేక కోచ్ లను నియమించడం జరిగిందని తెలిపారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..
స్పోర్ట్స్ లీగ్ కార్యక్రమంలో పాల్గొంటున్న క్రీడాకారులందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ గేమ్స్ తన చిన్ననాటి రోజులను గుర్తు చేస్తుందని, కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయన్నారు. ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ.. seventh inter society sports league 7వ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ లో కబడ్డీ, ఖోఖో, వాలీ బాల్, రన్, ఆర్చరీ వంటి క్రీడలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 4 రోజులపాటు నిర్వహించే క్రీడాపోటీలలో పాల్గొంటున్న విద్యార్థులు, కోచ్, సిబ్బందికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల వికాసం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షో వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రీడాపోటీలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, దేనినైనా సమానంగా తీసుకొని జీవితంలో విజయాలు సాధించాలని కోరారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరూ విజేతలేనని పిఓ పేర్కొన్నారు. బోథ్ Mla Anil jadhav ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడా రంగాలలో రాణించే విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. అనంతరం క్రీడా పోటీలను జెండా ఊపి ప్రారంభించి, 800 మీటర్ల రన్ లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు, మెడల్ లను అందజేశారు. ఈ సందర్బంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి, శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మోహతో, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
User
Comment Poster
Srikanth
Vaasthava Nestham
Replied
✅
Reply to This Comment
User
Comment Poster
St
Reply to This Comment
Comments