-Advertisement-

సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నిజామాబాద్: బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఆదివారం ఉదయం పంజాగుట్ట పోలీసులు సిఐని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహుల్ అమీర్ హైదరాబాదులోని ప్రగతి భవన్ వద్ద మార్కెట్లో ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. అనంతరం పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయగా ఈ కేసు నుంచి తన కుమారుడిని తప్పించేందుకు షకిల్ పోలీసులపై ఒత్తిడి చేశారు. అనంతరం రాహుల్ దుబాయ్ పారిపోయాడు. ఈ విషయం ఉన్నంత అధికారులు దృష్టికి వెళ్లింది. ప్రత్యేకంగా విచారణ జరిపిన పంజాగుట్ట పోలీసులపై వేటు వేశారు. విచారణలో భాగంగా బోధన సీఐగా పనిచేసిన ప్రేమ్ కుమార్ సహకరించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేశారు. బోధన్ కు చెందిన షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను సైతం అరెస్టు చేసినట్టు సమాచారం.
Comments
User
Comment Poster
Hi
Replied
 -Advertisement-