-Advertisement-

సీఎం రేవంత్ రెడ్డి తో గూగుల్ వైస్ చైర్మన్ ఏం చర్చించారంటే..

Vaasthava Nestham

- Google map, Google Earth పై చర్చ


వాస్తవ నేస్తం,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి అప్పుల లో ఉన్న రాష్ట్రాన్ని గట్టు ఎక్కించడం కోసం రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నట్లు Cm Revanth Reddy రేవంత్‌రెడ్డి అన్నారు. తన సీఎం నివాసంలో గురువారం ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ గ్రూప్‌ వైఎస్ చైర్మన్ (Google Vice Chairman) చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి Cm Revanth Reddy సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్‌ వైస్‌ Google ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ తో సీఎంతో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయండనికి సంసిద్ధ తను వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని వ్యవసాయం, విద్య ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములమవుతామన్నారు. అలాగే తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించడానికి లోతైన సాంకేతికత నైపుణ్యం తమతో ఉందని చంద్రశేఖర్ సీఎం కు వివరించారు. గూగుల్ మ్యాప్స్ Google Map గూగుల్ ఎర్త్ Google Earth ప్లాట్‌ఫారమ్‌ లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత మెరుగుదలపై సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించారు.
Comments
 -Advertisement-