-Advertisement-

మీసేవలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

Vaasthava Nestham
- రేషన్ కార్డుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ప్రభుత్వం
- కసరత్తు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
- సర్కార్ ఈ నెల 31వరకు ఈ కెవైసికి అవకాశం

వాస్తవ నేస్తం,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అర్హత గల పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల జారీ పై ration card తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల కోసం కొత్తగా అధికారికంగా మీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీ కరించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల ration card దరఖాస్తుదారుల కోసం ఫిబ్రవరి నెలాఖరులోగా అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.Praja palana ప్రజా పాలనలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఫిబ్రవరి చివరి వారంలో మీ సేవా ద్వారా అప్లై చేయొచ్చు. అభయ హస్తం పేరుతో మొత్తం 5 గ్యారెంటీలకు దాదాపు కోటి పది లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం, ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారే అత్యధికంగా ఉన్నారు. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో స్క్రూటినీ చేయడం త్వరగా అయ్యే పనికాదు. దీని వల్లే రేషన్ కార్డుల కోసం అధికారికంగా మీ సేవా ద్వారా అప్లికేషన్లను స్వీకరించాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డుల్లో పేరు లేని వారు , మార్పులు చేర్పులకోసం కూడా మీ సేవ ద్వా రా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. Praja palana ప్రజా పాలన కార్యక్రమంలో వచ్చిన అభయ హస్తం అప్లికేషన్స్ లో రేషను కార్డు, ధరణి త దితరాల కోసం అదనంగా మరో 19, 92,747 అప్లికేషన్లు వచ్చాయి. రేష న్ కార్డుల కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ NIC National informatic centre (ఎన్‌ఐసి ) ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డు అత్యంత ఉపయోగకరమైనది కావడంతో ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

హామీలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక..


ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పక్కాగా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ వైపు సంక్షేమ పథకాల అమలు, మరోవైపు అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి సారించారు. బోగస్ రేషన్ కార్డులను తొలగించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారు ఈ-కేవైసీ ekyc చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ గత 5 నెలలుగా కొనసాగుతోంది. రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోవడానికి జనవరి 31 తుది గడువుగా ఉంది. అలో పు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్ కార్డు ఈ కేవైసీని ekyc సులభంగానే చేసుకోవచ్చని చెబుతున్నారు. రేషన్ డీలర్లకు వద్దకు వెళ్లి ఆధార్ నంబర్ చెప్పి, లబ్దిదారులకు చెందిన వేలి ముద్రలు నమోదు చేస్తే ఈ-కేవైసీ పూర్తవుతుందని వివరిస్తున్నారు. రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోకుంటే వారి పేరును రేషన్ కార్డు నుంచి తొలగిస్తామని స్పష్టం చేస్తున్నారు. జనవరి 31వ తేదీ లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్‌కు లింక్ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అర్హులైన పేదలకు ప్రధాన మంత్రి గరీ బ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా రేష న్ బియ్యం, ఇతర సరకులు అందిస్తోంది. ఈ నేపధ్యంలోనే రేషన్‌కార్డు ఉన్న లబ్దిదారులు ఈకేవైసి ప్రక్రియను గడువులోగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన నిరుపేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు చేయడంతో తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
User
Comment Poster
S
User
Comment Poster
సూపర్
Replied
 -Advertisement-