-Advertisement-

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో దారుణం...

Vaasthava Nestham

- భార్య సూసైడ్

- భార్య మృతిని తట్టుకోలేక భర్త కూడా సూసైడ్


 -Advertisement-
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: గుడిహత్నూర్ మండలంలో భార్య భర్తలు ఇద్దరూ సూసైడ్ చేసుకున్న సంఘటన జిల్లాలో కలకమరం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడిహత్నూర్ మండలంలోని కొలహరి గ్రామంలో భార్య భర్తలు ఇద్దరూ సూసైడ్ చేసుకున్నారు. కొలహరి గ్రామానికి చెందిన సేవాలే విజయ్ తో మహారాష్ట్రలోని బోడది తాలూకా గుల్జా గ్రామానికి చెందిన పల్లవి తో గత సంవత్సరం మే మాసంలో వివాహమైంది.
Vaasthava Nestham Telugu Daily
సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్ళిన పల్లవి నిన్న మధ్యాహ్నం(శుక్రవారం) కొలహరికి వచ్చింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. కుటుంబ సభ్యులు పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపు గడియ పెట్టి ఉండడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి తలుపులు తీయించి చూడగా ఆమె పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడి ఉంది.
Vaasthava Nestham Telugu Daily
హుటాహుటిగా పల్లవి భర్త విజయ్ వాహనంలో చికిత్స నిమిత్తం రిమ్స్ తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యం తెలిపారు. భార్య మృతి చెందడంతో తనపై ఎలాంటి అపవాదు వస్తుందన్న భయంతో పల్లవి భర్త విజయ్ అదిలాబాద్ పట్టణ శివారు ప్రాంతమైన తీర్ పిల్లి స్మశాన వాటికకు వెళ్లి అక్కడ పురుగుల మందు సేవించి తన బంధువులకు సమాచారం అందించాడు.
Vaasthava Nestham Telugu Daily
హుటాహుటిగా బంధువులు అక్కడికి చేరుకొని విజయ్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకురాగా విజయ్ కూడా కూడా మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
Comments
User
Comment Poster
నైస్
Replied

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.