-Advertisement-

ఎంపీగా పోటీకి సై అంటున్న డాక్టర్ సాబ్..!

Vaasthava Nestham
- డాక్టర్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు
- ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి బరిలో ఉంటానంటున్న
ఆడే రాహుల్
- కుటుంబ సభ్యులకు ఉన్న రాజకీయ అనుభవం కలిసి వచ్చినా..?

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: పరిపాలన పూర్తిగా ప్రజల చేతుల్లోనే ఉండాలంటే, అవినీతి లేని భారతదేశాన్ని చూడాలంటే కొత్త తరం యువత రాజకీయాల్లోకి రావాల్సిందే.. అదే దిశగా పావులు కదుపుతున్నారు డాక్టర్ ఆడే రాహుల్. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికలపై పడింది. ఆదిలాబాద్ ఎంపీగా పోటీ Adilabad MP candidate చేయడానికి యువ డాక్టర్ ఆడే రాహుల్ ముందుకు వస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి ప్రజల మధ్యన ఉంటూ వైద్య వృత్తిలో కొనసాగుతూ ప్రజలకు సేవలందిస్తున్న బోథ్ నియోజకవర్గం నేరడిగొండ మండలం బోందిడి గ్రామానికి చెందిన ఆడే రాహుల్ ఎంపీగా పోటీ చేయడానికి సై అంటున్నారు. బీజేపీ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా BJP candidate బరిలో ఉండడం కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. Doctor Ade Rahul డాక్టర్ రాహుల్ తల్లి ఆడే పంచపులా గతంలో నేరడిగొండ జెడ్పీటీసీ గా పనిచేశారు. తన కుటుంబ సభ్యులకు రాజకీయ అనుభవం ఉండడం డాక్టర్ రాహుల్ కు కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తన కుటుంబ సభ్యులు జిల్లా స్థాయిలో కీలకమైన ప్రభుత్వ ఉద్యోగాలలో సేవలందిస్తున్నారు. ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన యువకుడిగా గత కొన్ని యేండ్ల నుండి వైద్య వృత్తిలో కొనసాగుతూ, చిన్నప్పటి నుండి శిశు మందిర్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి 20 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తిగా ఆడే రాహుల్ కు ప్రజల్లో మంచి పేరుంది. ఈ క్రమంలో సమాజానికి మరింత సేవలు అందించాలనే సంకల్పంతో ఎంపీ బరిలో నిలబడి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాడు. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి కావడంతో బీజేపీ పార్టీ నుండి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారని చర్చలు జరుగుతున్నాయి. దాదాపు ఏడు ఏండ్లు బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇంఛార్జిగా విధులు నిర్వహించి, కోవిడ్ కష్టకాలంలో జూడ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఆడే రాహుల్ కు ఉంది. ఆర్ఎస్ఎస్ లో RSS కీలకమైన వ్యక్తి బిఎల్ సంతోష్ వద్ద ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ రాహుల్ పేరు పరిశీలనలో ఉందని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. యువకుడు రాబోయే తరాలకు మరిన్ని సేవలు అందించాలని ధృడ సంకల్పంతో ఎంపీ బరిలో నిలిచి ఆదిలాబాద్ జిల్లా రుపురేఖలు మార్చి మరింత అభివృధి దిశగా అడుగులు వేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాడని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
 -Advertisement-