-Advertisement-

Breaking News: మామ అల్లుళ్లపై గొడ్డలితో దాడి

Vaasthava Nestham
- దాడిలో మామ మృతి, అల్లుడికి తీవ్ర గాయాలు

వాస్తవ నేస్తం,నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో మామ అల్లుళ్ళపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది.  వివరాల్లోకి వెళితే.. అనంతపేట్ గ్రామానికి చెందిన పోలీస్ బుచ్చన్న అనే వ్యక్తి తన అల్లుడితో కలిసి ద్విచక్ర వాహనంపై నిర్మల్ Nirmal వైపు వెళ్తున్నాడు. బంగాల్ పేట్ Bangal Pet జంగల్ హనుమాన్ వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తులు వారిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర గాయాల పాలై పోలీసు బుచ్చన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అల్లుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ మల్లారెడ్డి సందర్శించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
User
Comment Poster
Op
Replied
User
Replied
నైస్
Replied
User
Comment Poster
123456789
 -Advertisement-