-Advertisement-

రెచ్చిపోతున్న ఇసుకాసురులు.. ఫారెస్ట్ ఆఫీసర్లను ట్రాక్టర్ తో ఢీకొట్టేందుకు యత్నం

Illegal sand business in india illegal sand mining complaint number illegal sand mining act how to stop illegal sand mining sand mining companies ille
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,భద్రాద్రి కొత్తగూడెం: ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇసుకను అక్రమ రవాణా చేయడమే కాకుండా ఫారెస్ట్ అధికారులపై దాడులు చేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేసిన ఫారెస్ట్ (Forest department)అధికారులపైనే ట్రాక్టర్ తో ఢీ కొట్టారు. ఇల్లందు ఫారెస్ట్ (Forest) రేంజ్ పరిధిలోని టేకులపల్లి మండలం నుంచి కొన్నాళ్లుగా ట్రాక్టర్ల ద్వారా ఇల్లెందుకు రాత్రి, తెల్లవారు జామున యథేచ్చగా ఇసుక మాఫియా కొనసాగుతుంది. దీంతో అటవీ శాఖ సిబ్బంది 9వ మైల్ తండా రోళ్లపాడు సమీపంలో రెండు ట్రాక్టర్లను (tractor) పట్టుకున్నారు.

ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి..


ఇల్లెందు ఎఫ్డిఓ కర్ణావత్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారు జామున ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం రావడంతో కొమరారం ఎఫ్ఆర్వో, సిబ్బందిని పంపగా టేకులపల్లి మండలంలో ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవాలని ప్రయత్నించగా ఒక ట్రాక్టర్ తప్పించుకునే క్రమంలో రివర్స్ తిప్పుతూ అటవీ శాఖకు చెందిన కారును ట్రాక్టర్ ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. వాహనంలో ఉన్న సిబ్బంది తప్పించుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అప్రమత్తమైన సిబ్బంది రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతూ ఇసుకను అక్రమ రవాణా చేయడం నేరమన్నారు. ఫారెస్ట్ వాహనంపై ట్రాక్టర్ తో గుద్దడానికి యత్నించిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


యూపీఐ ట్రంజాక్షన్ చేస్తున్నారా..? ఇది ఒక్కసారి చదవండి.
Comments
 -Advertisement-