-Advertisement-

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,అనంతగిరి: పట్టణంలోని సనా ఇంజనీరిగ్ కళాశాలలో అనంతగిరి మడలం ఎస్సై అనిల్ రెడ్డి సైబర్ నేరాలు, సోషల్ మీడియా, డ్రగ్స్ మత్తు మందులు, గంజాయి నిషేధం పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మహిళలు, పిల్లల భద్రత గురించి, పోలీస్ కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ కళాబృందం చేత  సోషల్ మీడియా, ఓటిపి ఫ్రాడ్స్, సైబర్ నేరాల గురించి,  టోల్ ఫ్రీ నెంబర్ 1930  24/7 పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు. సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాల గురించి, షీ టీమ్స్, మహిళల భద్రత, పిల్లల పైన సోషల్ మీడియా ప్రభావం, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎటువంటి ఏ విధమైన అనర్ధాలు జరిగితే వెంటనే  1930 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి తెలియపరచాలని అన్నారు. ఆట, పాటల లో ముందుకు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సనా కాలేజీ ప్రిన్సపల్ డాక్టర్ నాగప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ అజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ కుంభం శ్రీను, కానిస్టేబుల్, ప్రతాప్ రెడ్డి, రవీంద్ర నాథ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, చారి, నాగార్జున, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-