-Advertisement-

సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం

Vaasthava Nestham

- ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో తాళం వేసిన మున్సిపల్‌ అధికారులు

- ఇబ్బందులు పడుతున్న ప్రజలు


వాస్తవ నేస్తం,నిర్మల్ : జిల్లా కేంద్రంలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి మున్సిపల్‌ అధికారులు గురువారం తాళం వేశారు. Nirmal జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రైవేటు భవనంలో కొనసాగుతోంది. కాగా పన్ను చెల్లించాలని పలుమార్లు మున్సిపల్ అధికారులు Municipal Officers నోటీసు జారీ చేసినప్పటికీ ఆ భవన యజమాని స్పందించకపోవడంతో మున్సిపల్ అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం వేశారు. రూ.లక్షకు పైగా ఆస్తిపన్ను బకాయి ఉండటంతో ఆఫీసును sub register office సీజ్‌ చేశారు. చాలా కాలంగా బకాయిలు పెండింగ్‌ లో ఉన్నాయని దీంతో ఆఫీస్‌ కు తాళం వేశామని వెల్లడించారు. దీంతో సిబ్బంది, ప్రజలు కార్యాలయం ముందు  పడిగాపులు కాశారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
Comments
 -Advertisement-