-Advertisement-

వారెవ్వా..! ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

Vaasthava Nestham

- ప్రజల సౌకర్యార్థం తన సొంత ఇంటినే కూల్చడానికి అనుమతి ఇచ్చిన ఎమ్మెల్యే

- ప్రశంసిస్తున్న నియోజకవర్గ ప్రజలు


వాస్తవ నేస్తం,కామారెడ్డి: వారెవా ఎమ్మెల్యే.. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అంటూ... కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. Kamareddy MLA Kattipelli Ventakata Ramana Reddy గత ఏడాది జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్ళలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు కోసం సహకరించాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 30 ఫీట్లు మాత్రమే ఉంది. రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయి గుంతలు, షెడ్డులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు తన ఇంటి నుంచే మొదలు పెట్టాలని అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చేసి ఆ స్థలాన్ని అధికారులకు అప్పగిం చారు. శనివారం ఉదయం ఆర్‌అండ్‌బి, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఆధ్వర్యంలో జేసీబీలతో దగ్గరుండి ఇంటిని కూల్చేయించారు. అదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం కూడా ఉండటంతో అలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, వారం రోజుల్లో రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్డులు ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు.నెల రోజుల్లో ఇప్పుడున్న రోడ్డుకు అదనంగా మరొక 24 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే ఇంటినుంచి పాత బస్టాండ్ వరకు చేపట్టబోయే రోడ్డు వెడల్పులో ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది. దాంతో ఆయన స్పందనపై ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పై CM Revanth Reddy విజయం సాధించి హాట్ టాపిక్ గా మారారు. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా తన సొంత ఇంటిని కూల్ చేసి కూల్చేసి ప్రశంసం పొందుతున్నారు.
Comments
 -Advertisement-