-Advertisement-

కల్తీ ఆహారం తిని విద్యార్థులు అస్వస్థత

Vaasthava Nestham
- మండల పరిషత్ పాఠశాలలో ఘటన
- మధ్యాహ్న భోజనం తిని అవస్థతకు గురైన నలుగురు విద్యార్థులు
- విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

వాస్తవ నేస్తం,అనంతగిరి: కల్తీ ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన మండల కేంద్రంలోని మండల పరిషత్ పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే.. Suryapet Ananthagiri Mandal మండల కేంద్రంలోని మండల పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా భోజనం చేసిన విద్యార్థుల్లో సుమారు నలుగురికి వాంతులు అయ్యాయి. మధ్యాహ్నం భోజనం తర్వాత ఇంటికి వెళుతున్న కొత్తపల్లి సాత్విక్ అనే నాలుగో తరగతి విద్యార్థి Students మార్గమధ్యలో కళ్ళు తిరిగి పడిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, పాఠశాలల ఉపాధ్యాయులు హుటా హుటా నా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి సలీం షరీఫ్ తో పాటు తహసీల్దార్ రవికుమార్ పాఠశాలకు చేరుకొని విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్యం పై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఆరోగ్యం పై మండల వైద్యాధికారి డాక్టర్ రంజిత్ ను వివరణ కోరగా ఆసుపత్రికి ఇద్దరు విద్యార్థులను వారి తల్లిదండ్రులు తీసుకొచ్చారని ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందన్నారు.
Students get sick after eating adulterated food

పాఠశాలలో ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు..


కల్తీ ఆహారంతో అస్వస్థతకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారానికి బదులుగా కల్తీ ఆహారం పెట్టి తమ పిల్లలు భవిష్యత్తును పాడు చేస్తున్నారంటూ ఉపాధ్యాయులపై ఆగ్రహించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రవర్తిస్తున్న తీరుపై తల్లిదండ్రులు ఎంఈఓ సలీం షరీఫ్ కు ఫిర్యాదు చేశారు. పరిస్థితిని గమనించిన ఎంఈఓ సలీం షరీఫ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా తమ పిల్లల పట్ల ఉపాధ్యాయులు ప్రవర్తన సరిగా లేదని వాపోయారు. పాఠశాలలో కనీసం మంచినీటి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇంటి నుండి త్రాగునీరు తీసుకొని రావాల్సి వస్తుందన్నారు. బాత్రూంలో కూడా సరిగా లేకపోవడంతో తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. అనంతరం ఎంఈఓ షరీఫ్ మాట్లాడుతూ.. ప్రతిరోజు వండిన ఆహారంను ఉపాధ్యాయులు ఒకరు ముందుగా తినాలని తర్వాత విద్యార్థులకు పెట్టాలని సూచించారు. అదేవిధంగా పాఠశాలల్లో మంచినీటిని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

తనిఖీలు నిర్వహించిన బియ్యంలో పురుగులు...


పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కల్తీ జరుగుతుందని భావించిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. బియ్యంలో విపరీతంగా పురుగులు ఉండటంతో అధికారుల నిర్గంత పోయారు. తాసిల్దార్ రవికుమార్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పురుగులు పట్టిన బిర్యాని వెంటనే మార్చాలని ఆదేశించారు.
Comments
 -Advertisement-