-Advertisement-

మేకల కాపరి పై గొడ్డలితో దాడి

Vaasthava Nestham

- గుడిహత్నూర్ మండలంలో ఘటన
- గతంలోని భూతగాదాలు, మంత్రలనేపమే కారణం అంటూ ఉన్న స్థానికులు
- బోథ్ నియోజకవర్గంలో పక్షం రోజుల్లో రెండు ఘటనలు


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఇటీవల ఇచ్చోడ మండల కేంద్రంలో భూతగాదాలతో ఓ యువకుడిని సొంత బాబాయి, తన బాబాయి కొడుకు దారుణంగా హత్య చేసిన ఘటన మరువకముందే గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామ శివారులో మేకలు మేపుతున్న ఒక వ్యక్తిపై ఇద్దరు యువకులు ఈరోజు (శనివారం) మధ్యాహ్నం గొడ్డలితో attack on person with axe విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం 
కొల్హారి గ్రామ శివారులో బెదాడే శంకర్ అనే వ్యక్తి మేకలు మేపుతుండగా ఇద్దరు యువకులు 
బెదాడే శంకర్ మెడ, వీపు పై గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. గాయపడ్డ వ్యక్తి భార్య అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుని చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. ఘటన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
Comments
User
Comment Poster
.....
..
Replied
User
Replied
Hi
Replied
 -Advertisement-