-Advertisement-

Breaking News: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

Vaasthava Nestham


వాస్తవ నేస్తం,ఇచ్చోడ: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలైన ఘటనఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండల కేంద్రం నుండి బజార్హత్నూర్ వెళ్లే రోడ్డుపై ఎస్బిఐ బ్యాంక్ దగ్గర్లో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తుల్లో ఒకరు బజార్హత్నూర్ మండలం వర్తమన్నూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. క్షతగ్రాత్రులను చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Comments
User
Comment Poster
O shad
Replied
 -Advertisement-