-Advertisement-

PMEGP: చేతివృత్తుల వారికి చేయూత పీఎం విశ్వకర్మ యోజన

pm vishwakarma yojana online apply pm vishwakarma yojana official website pm vishwakarma yojana gov in
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్:75 యేళ్ళ ప్రజాస్వామ్య భారత దేశంలో చేతివృత్తుల వారిని ఆదుకుని ప్రోత్సహించిన సందర్బాలు చాలా తక్కువ కానీ కేంద్రంలోని నరేంద్రమోధీ సర్కార్ Central Government అందుకు శ్రీకారం చుట్టింది. విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతివృత్తుల వారికోసం పీఎం విశ్వకర్మ యోజన Priyam Vishwakarma Yojana అనే పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ పథకం చేతి వృత్తుల వారికి చేయూత నందిస్తుంది. విశ్వకర్మల ఆర్థిక అభివృద్ధి కోసం PMEGP ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ పథకం 18 కులాల వారికి అనగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వడ్రంగులు, స్వర్ణకారులు, కమ్మరి, తాపీ మేస్త్రీలు, రాతి శిల్పులు, టైలర్, బొమ్మల తయారీదారులు, రజకులు, నాయి బ్రాహ్మణులు, మేదరులు, జాలరులు మొదలగు  చేతివృత్తుల పనుల వారు ఈ పథకానికి అర్హులు.

అర్హతలు ఇవే....


👉18 సంవత్సారాలు నిండి ఉండాలి,
👉18 వృత్తులలో ఏదైనా వృత్తిని చేస్తూ ఉండాలి,
👉ఉద్యోగుల కుటుంబ సభ్యులై ఉండరాదు,
👉ముద్ర లోన్, PMEGP పొందని వారు లేదా లోన్ పూర్తి చేసిన వారు అర్హులు

ప్రయోజనాలు...


👉 ఈ పథకంలో, ప్రతి లబ్ధిదారునికి 5 రోజులు లేదా 15రోజుల పాటు నైపుణ్య శిక్షణ ఇస్తారు.

👉 శిక్షణ కాలంలో రోజువారీ రూ.500 స్టైఫండ్ కూడా చెల్లిస్తారు.

👉 సర్టిఫికెట్ మర్రియు ఐడీ కార్డును అందిస్తారు..

👉 శిక్షణ అనంతరం 15 వేల రూపాయల విలువ చేసే టూల్ కిట్ అందిస్తారు.

మరియు 
👉 మొదటి విడత లక్ష రూపాయల లోన్ (18 నెలల రీ పేమెంట్)

👉 రెండవ విడత రెండు లక్షల లోన్ ( 30 నెలల రీ పేమెంట్) లను అందిస్తారు.

ఈ లోన్ కు సంవత్సరానికి 5 శాతం వడ్డీ ఉంటుంది.

ఈ పథకం కోసం కేంద్రం రూ.13,000 కోట్లను ఇప్పటికే  కేటాయించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.
హస్తకళాకారులు, వివిధ చేతివృత్తుల వారిని వారి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి సహాయం చేయడమే ఈ పథకం ఉద్దేశం.

అర్హత పత్రాలు...

1. ఆధార్ కార్డు
2. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు
3. అడ్రస్ ప్రూఫ్
4. మొబైల్ నంబర్
5. కుల ధృవీకరణ పత్రం
6. బ్యాంకు ఖాతా పాస్ బుక్
7. పాస్పోర్ట్ సైజ్ ఫొటో
8. పాన్ కార్డు
అర్హత గలవారు వేంటనే మీ దగ్గరలోని CSC సెంటర్, మీ సేవ సెంటర్ లో దరఖాస్తు చేసుకోవాలి.

అధికారిక వెబ్‌సైట్: https://pmvishwakarma.gov.in/
Comments
User
Comment Poster
Super sir
Replied
👍 TQ
User
Replied
Good
Replied
User
Comment Poster
Ravi
User
Replied
Super sir
Replied
 -Advertisement-