-Advertisement-

TS RTC: బ‌స్సుల్లో జీరో టికెట్ తీసుకోక‌పోతే రూ.500 జ‌రిమానా..!

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,హైదరాబాద్: మ‌హిళా ప్ర‌యాణికులు ఆర్‌టిసి (TS RTC) బ‌స్సులో త‌ప్ప‌నిస‌రిగా జీరో టికెట్ తీసుకోవాల‌ని ఎండి సజ్జ‌నార్ తెలిపారు. దాని ఆధారంగానే టిఎస్ ఆర్‌టిసికి రాష్ట్ర ప్ర‌భుత్వం డ‌బ్బును రియంబ‌ర్స్ చేస్తుందని.. జీరో టికెట్ లేకుండా ప్ర‌యాణిస్తే సంస్థ‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌న్నారు. జీరో టికెట్ తీసుకోకుండా ప్ర‌యాణిస్తే .. చెకింగ్‌లో గుర్తిస్తే స‌ద‌రు వ్య‌క్తికి రూ. 500 జ‌రిమానా విధించే అవ‌కాశం ఉంద‌ని, అదేవిధంగా సిబ్బంది ఉద్యోగం ప్ర‌మాదంలో ప‌డే అశ‌కాశం ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. రాష్ట్రంలోని మ‌హిళా ప్ర‌యాణికులు బస్సుల్లో ఒరిజ‌న‌ల్ గుర్తింపు కార్డులు త‌ప్ప‌నిస‌రిగా చూపించాలని టిఎస్ ఆర్‌టిసి విజ్ఞ‌ప్తి చేసింది. ఫొటో, అడ్ర‌స్ స్ప‌ష్టంగా ఉండే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు జారీ చేసిన ఏ అస‌లైన గుర్తింపు కార్డునైనా అనుమ‌తిస్తామ‌ని టిఎస్ ఆర్‌టిసి ఎండి స‌జ్జ‌నార్ తెలిపారు. మహిళా ప్ర‌యాణికులు కొంత మంది స్మార్ట్‌ఫోన్ల‌లో, ఫొటొ జిరాక్స్ కాపీలు, క‌ల‌ర్ జిరాక్స్‌లు చూపిస్తుండ‌టంతో ప్ర‌యాణ స‌మ‌యం పెరుగుతుంద‌ని.. సిబ్బంది కూడా ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. అందుక‌ని స్ప‌ష్టంగా క‌నిపించే కార్డులు చూపాల‌న్నారు. పాన్‌కార్డులో అడ్ర‌స్ లేనందున అది ఉచిత ప్ర‌యాణానికి చెల్లుబాటు కాద‌న్నారు. అస‌లైన గుర్తింపు కార్డు లేక‌పోతే త‌ప్ప‌నిస‌రిగా డ‌బ్బు చెల్లించి టికెట్ తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు.
Comments
 -Advertisement-