Bharat ratna awards: ఒకే ఏడాది ఐదుగురికి భారతరత్న
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవార్డుల పంట పండించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం (Indias highest civilian award) భారత రత్న (Bharat Ratna ) ప్రకటించింది. ఇటీవలే బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌లకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం మరో ముగ్గురికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు (PV Narasimha Rao), మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్రం ‘భారత రత్న’ ప్రకటించింది. దీంతో ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి అవార్డులు ప్రకటించినట్లైంది.
దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’. ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరుకుల కేంద్రం ఈ పురస్కారంతో సత్కరిస్తుంటుంది. ఇది జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఇప్పటివరకు నలభై మందికిపైగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది.
ఏటా ఈ పురస్కారాన్ని ముగ్గురికి మాత్రమే ప్రకటిస్తుంటారు. దేశ ప్రధానమంత్రి మాత్రమే రాష్ట్రపతికి ఏడాదికి గరిష్ఠంగా ముగ్గురిని ఈ పురస్కారానికి సిఫారసు చేయవచ్చు. కానీ, దీనికి పరిమితి మాత్రం లేదు. 1999లో ఈ పురస్కారాన్ని నలుగురు వ్యక్తులకు ప్రదానం చేశారు. అంతే అప్పటి నుంచి ఏడాదికి ముగ్గురికి మాత్రమే ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే, ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు ఏకంగా ఐదుగురికి భారత రత్న వరించడం విశేషం. కాగా, ఈ ఏడాది భారతరత్న అవార్డులను ప్రకటించిన ఐదుగురిలో నలుగురికి మరణానంతరం అవార్డు వరించింది. ప్రస్తుతం అవార్డుకు ఎంపికైనవారిలో ఎల్‌కే అద్వానీ మాత్రమే జీవించి ఉన్నారు.
Cc
Comment Poster
Super
Vaasthava Nestham
Replied
👍
Reply to This Comment
Comments