-Advertisement-

ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసినా మాజీ సీఎం

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,హైద‌రాబాద్‌: బిఆర్ఎస్ అధినేత, మాజి ముఖ్య‌మంత్రి కెసిఆర్ గురువారం ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కెసిఆర్ గ‌జ్వేల్ నుండి గెలుపొందిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత రోజు ఆయ‌న ప్రమాదానికి గురై ఆస్ప‌త్రిలో శ‌స్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌లేదు. గురువారం మ‌ధ్యాహ్నం శాస‌న స‌భాప‌తి కార్యాల‌యంలో గ‌డ్డం ప్ర‌సాద్ కెసిఆర్‌తో ప్ర‌మాణం చేయించారు. ఈ కార్యక్ర‌మంలో బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-