-Advertisement-

ఏడేళ్ల చిన్నారి రేప్ కేసులో ముగ్గురికి జీవిత‌ఖైదు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఏడేళ్ల చిన్నారి రేప్ కేసులో ముగ్గురికి జీవిత చరిత్ర చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బ‌లోడా బ‌జార్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. ఏడేళ్ల చిన్నారిని రేప్ చేసిన కేసులో ముగ్గురు నిందితుల‌కు జీవిత‌ఖైదు శిక్ష‌ను విధించింది. వివరాల్లోకి వెళితే...బ‌లోడా బ‌జార్ సిటీ స‌మీపంలో ఉన్న ఓ గ్రామంలో త‌న ప‌క్కింట్లో చిన్నారి ఆడుకుంటున్న స‌మ‌యంలో 17 ఏళ్ల వ్య‌క్తి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లి రేప్ చేశాడు.  2021లో జ‌రిగిన రేప్, మ‌ర్డ‌ర్ కేసులో ఓ నిందితుడి ఆ ఘ‌ట‌న స‌మ‌యంలో 17 సంవత్సరాలు మాత్ర‌మే ఉన్నాడు. అద‌న‌పు జిల్లా సెష‌న్స్ జ‌డ్జి ప్ర‌శాంత్ ప‌రాష‌ర్ ఈ ఆదేశాల‌ను జారీ చేశారు. జ‌న‌వ‌రి 29వ తేదీన ఆదేశాలు ఇవ్వ‌గా, బుధ‌వారం ఆ తీర్పు కాపీని రిలీజ్ చేశారు. ఐపీసీ, పోక్సో, చ‌ట్టాల ప్ర‌కారం నిందితుల‌కు శిక్ష‌ను ఖ‌రారు చేశారు. బ‌లోడా బ‌జార్ సిటీ స‌మీపంలో ఉన్న ఓ గ్రామంలో త‌న ప‌క్కింట్లో చిన్నారి ఆడుకుంటున్న స‌మ‌యంలో 17 ఏళ్ల వ్య‌క్తి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లి రేప్ చేశాడు. ఆ త‌ర్వాత త‌న త‌ల్లితో క‌లిసి ఆ చిన్నారిని హ‌త్య చేశాడు. మ‌రో నిందితుడితో క‌లిసి ఆ పాప మృత‌దేహాన్ని ఓ బావిలో ప‌డేశాడు. చిన్నారి మృత‌దేహం దొరికిన తర్వాత పోలీసులు విచార‌ణ చేప‌ట్టి ముగ్గురిపై కేసు బుక్ చేశారు. ఈ కేసులో 29 మంది నుంచి సాక్ష్యాలు సేకరించారు.
Comments
 -Advertisement-