-Advertisement-

కల్యాణ వైభోగమే..

marriage dates in 2024 hindu panchang telugu marriage muhurtham dates 2024 best wedding dates 2024 astrology unique wedding dates in 2024 2024 january
Vaasthava Nestham

> మాఘం రావడంతో శుభకార్యాల సందడి షురూ
> రేపటి నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం
> ఎల్లుండి వసంత పంచమి.. వేలాది కల్యాణాలు
> ఏప్రిల్ 26 వరకూ దాదాపు 30 శుభ ఘడియలు
> ఫంక్షన్ హాళ్లు దొరక్క చాలామందికి ఇబ్బందులు


వాస్తవ నేస్తం,హైదరాబాద్: పుష్యమాసం వెళ్లిపోయింది.! 'మాఘ మాసం ఎప్పుడొస్తుందో..' అంటూ పాటలు పాడుకున్న జంటల కలలు నెరవేరే సమయం వచ్చేసింది.! మాఘంలో మంగళవారం నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో.. రాష్ట్రవ్యాప్తంగా శుభకార్యాల సందడి షురూ అయింది. 
పెళ్లిళ్లు, ఉపనయనాలు, అక్షరాభ్యాసాలు.. ఒక్కటనేమిటి ఇంచుమించుగా అందరిళ్లల్లో ఏదో ఒక వేడుక. బంధువులు, స్నేహితులను పిలిచి ఎవరి స్థాయికి తగినట్లుగా వారు ఆ శుభకార్యాలను జరిపించేందుకు ఆరాటపడుతున్నారు. మరీ ముఖ్యంగా మాఘమాసం అంటే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆ సందడే ఎక్కువగా కనిపిస్తోంది. పంచాంగం ప్రకారం ఈ నెల 13 నుంచి ఏప్రిల్ 26 .. దాదాపు 30 మంచి ముహూర్తాలున్నాయి. ఇవి కాక.. వధూవరుల జన్మనక్షత్రాల ఆధారంగా నిర్ణయించే ముహూర్తాలు అదనం, సాధారణంగా ఏటా వసంత (మాఘ శుద్ధ) పంచమినాడు కొన్ని వేల పెళ్లిళ్లు జరగడం కద్దు. మాఘమాసం రాగానే వచ్చే మంచి ముహూర్తాల్లో బలమైనది కావడం, సరస్వతీ దేవి పుట్టినరోజు కావడంతో.. చాలా మంది ఈ ముహూర్తానికి పెళ్లిళ్లు నిశ్చయం చేస్తారు. వసంత పంచమినే శ్రీ పంచమిగా కూడా వ్యవహరిస్తారు. ఈనెల 14న వాలెంటైన్స్ డే (ప్రేమికుల దినం) కూడా కావడంతో చాలా జంటలు తమ తల్లిదండ్రులను ఒప్పించి మరీ ఆ రోజునే తమ పెళ్లి రోజుగా ఖరారు చేసుకున్నారు. 

ఫిబ్రవరి 14న దాదాపు 60 వేల కల్యాణాలు..


లెక్కల్లో చెప్పాలంటే.. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఫిబ్రవరి 14న దాదాపు 60 వేల కల్యాణాలు జరుగుతున్నట్టు అంచనా. ఆ తర్వాత ముహూర్తాలకు నిశ్చయమైన కల్యాణాలను కూడా కలుపుకొంటే ఈ సీజన్లో దాదాపు 2 లక్షల వివాహాలు జరగనున్నాయి. గత ఏడాది నవంబర్, డిసెంబర్లో కేవలం 10 నుంచి 12 దాకా మాత్రమే మంచి ముహూర్తాలు ఉండడం.. అవి కూడా ఎక్కువ మంది జన్మనక్షత్రాలకు సరిపడకపోయే స్థితి ఉండడంతో అప్పట్లో వివాహాలు పెద్దగా జరగలేదు. అప్పుడు వాయిదా వేసుకున్నవారు కూడా మాఘ మాసానికి ప్రాముఖ్యం ఇచ్చి.. మూణ్నెల్లు ముందుగానే ఫంక్షన్ హాళ్లను బుక్ చేసేసుకోవడంతో.. ఆ తర్వాత ముహూర్తాలు నిర్ణయించుకున్నవారికి కల్యాణ వేదికలు దొరకడమే కష్టంగా మారే పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. 
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నార్సింగి, కోకాపేట్, ఎల్బీనగర్, చైతన్యపురి, నాగోలు, ఉప్పల్, మియాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లోని భారీ ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు చాలా వరకూ బుక్ అయిపోయాయి. కొన్నిచోట్ల ఫంక్షన్హ్పాళ్లరోజువారీ అద్దె రూ.2 నుంచి 5 లక్షల వరకు ఉన్నప్పటికీ వాటిని బుకింగ్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దిగువ మధ్య తరగతి కుటుంబాలు తమస్థాయికి తగిన విధంగా చిన్న ఫంక్షన్ హాళ్లు, బాంకెట్ హాళ్లు, కమ్యూనిటీ భవనాలను ఎంచుకుంటున్నారు. ఫంక్షన్ హాళ్లతోపాటు కల్యాణ మండపాలు నిర్మించే డెకరేటర్స్, వధువులకు అలంకరణ చేసే బ్యూటిషియన్లు, మెహందీ ఆర్టిస్టులు, షామియానా సప్లయర్స్, మంగళవాయిద్యాల వారు, ఆర్కెస్ట్రా, కేటరింగ్ వారికి కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. గుత్తకు మాట్లాడుకుని వీరందరినీ సమకూర్చి నిర్విఘ్నంగా శుభకార్యాన్ని జరిపే ఈవెంట్ మేనేజర్లూ ఇప్పుడు ఫోన్ కాల్కు దొరికే పరిస్థితి లేదు. కొద్దిగా లేటుగా ముహూర్తాలు నిర్ణయించుకున్నవారు వీటన్నింటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాల్సి వస్తోంది. ఆదరాబాదరాగా

ఏప్రిల్ 26 దాటితే.. శ్రావణంలోనే.!


ఫిబ్రవరి: 13,14, 17, 18, 24, 28, 29 మార్చి: 2, 3, 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30 2໖໖: 3, 4, 9, 18, 19, 20, 21, 22, 24, 26 ఈతేదీలు దాటితే మళ్లీ మంచి ముహూర్తాలు శ్రావణమాసంలోనే. అందుకే చాలా మంది ఇప్పుడే ముహూర్తాలు పెట్టుకున్నారు. పరీక్షల సీజన్ కావడంతో ఇప్పుడు కుదరని వారు శ్రావణానికి తమ ప్రణాళికలను మార్చుకుంటున్నారు.
Comments
 -Advertisement-