-Advertisement-

నేడే వసంత పంచమి... వసంత పంచమి పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు..? ఈరోజు ఏ పనులు చేస్తే మంచిది..

why is basant panchami celebrated vasant panchami 2024 date and time vasant panchami 2025 vasant panchami drawing vasant panchami 2024 vasant panchami
Vaasthava Nestham
Vasantha panchami 2024: ఫిబ్రవరి 14న వసంత పంచమి జరుపుకుంటున్నారు. ఈరోజు సరస్వతీ దేవిని పూజించడంతో పాటు కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. దీంతో సరస్వతీ దేవికి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Vasantha panchami 2024: జ్ఞానం, వాక్కుని ప్రసాదించే తల్లిగా సరస్వతీ దేవిని పూజిస్తారు. విద్యార్థులకు అక్షరభ్యాసం సైతం చేయిస్తారు. మాఘ మాసం శుక్ల పక్షం ఐదో తిథిన వసంత పంచమి జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 14న వసంత పంచమి వచ్చింది. నేటి నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుందని నమ్ముతారు. వసంత పంచమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బాసర లోని సరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వసంత పంచమి చాలా శుభప్రదమైన రోజుగా భావిస్తారు. ఈరోజు సరస్వతీ దేవిని పూజిస్తారు. అమ్మవారిని పూజించడం వల్ల జీవితంలోని ప్రతి రంగంలో అపారమైన విజయం లభిస్తుందని, వృత్తిలో ఆటంకాలు తొలగిపోతాయని, మంచి జ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈరోజు కామదేవుడు, రతీదేవిని కూడా పూజిస్తారు. రతీదేవి మన్మథుడుని పూజించడం వల్ల వైవాహిక జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. వసంత పంచమి పూజా విధానం, శుభ ముహూర్తం, ఈరోజు ఎలాంటి పనులు చేయాలని దాని గురించి ఇక్కడ తెలుసుకోండి.

వసంత పంచమి శుభ ముహూర్తం..


వసంత పంచమి శుభ ముహూర్తం ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 2.41 గంటల నుంచే ప్రారంభంఅవుతుంది. ఇది ఫిబవరరీ 14 మధ్యాహ్నం 12.12 గంటల వరకు కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు సరస్వతీ దేవిని పూజించేందుకు శుభ సమయం.

పూజా చేసే విధానం విధానం..


బ్రహ్మ ముహూర్తం సమయంలో పవిత్ర గంగా నది స్నానం ఆచరిస్తే మంచిది. స్నానం చేసేందుకు సూర్యోదయం 6.38 గంటల నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు ముహూర్తం ఉంది. స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక చెక్క పీట మీద పసుపు రంగు వస్త్రం పరిచి దాని మీద కలశ ప్రతిష్టాపన చేసుకోవాలి. అనంతరం సరస్వతీ దేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించాలి. వినాయకుడిని పూజించిన తర్వాత సరస్వతీ దేవికి పసుపు రంగు వస్త్రాలు సమర్పించి పూజ చేయాలి. మామిడి ఆకులు, పసుపు, కుంకుమ, దుర్వా గడ్డి, పసుపు రంగు స్వీట్లు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించాలి. పూజలో పుస్తకాలు, పెన్నులు, సంగీత వాయిద్యాలు పెట్టి పూజించాలి. సరస్వతీ మంత్రాన్ని భక్తి శ్రద్దలతో పఠించాలి.శనగపిండి లడ్డూ, పసుపు లేదా తెలుపు స్వీట్లు, అరటిపండ్లు వంటివి సరస్వతీ దేవికి సమర్పించాలి. 
విద్యార్థులు “ఓం ఐ సరస్వతీ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు భక్తి శ్రద్ధలతో జపించాలి. ఇలా చేయడం వల్ల వారికి జ్ఞానం, తెలివితేటలు లభిస్తాయి. సరస్వతీ దేవిని పూజిస్తే చంద్రుడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు హానికరమైన ప్రభావాలు చాలా వరకు తగ్గిస్తుంది. సరస్వతి దేవిని పూజించడం వల్ల, వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందని భక్తులు భావిస్తారు.

ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మంచిది..

వసంత పంచమి సందర్భంగా శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వసంత పంచమి చాలా మంచి రోజుగా భావిస్తారు. ఈరోజు కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. ఈరోజు చాలా మంది గృహ ప్రవేశం, నామకరణం, పెళ్లి షాపింగ్, చేస్తారు. ఈరోజు వివాహం చేసుకుంటే సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఆ దంపతుల బంధం ఏడు జన్మల పాటు ఉంటుందని నమ్ముతారు.


వసంత పంచమి రోజు నెమలి మొక్కను ఇంటికి తీసుకొచ్చి నాటడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ మొక్కని ఇంటి తూర్పు దిశలో నాటాలి. ఇంట్లో ఈ నెమలి మొక్కను నాటితే పిల్లలకు చదువు మీద ఆసక్తి కలుగుతుందని, సరస్వతీ దేవి అనుగ్రహం ఎప్పుడూ వారి మీద ఉంటుందని నమ్ముతారు.

సంగీతంపై ఆసక్తి ఉన్నవారు వసంత పంచమి రోజు సంగీత వాయిద్యాలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు. ఇలా చేస్తే సరస్వతీ దేవి సంతోషిస్తుందని విశ్వసిస్తారు. ఈరోజు భూమి లేదా వాహనం కొనుగోలు చేయడం చాలా మంచిదని భావిస్తారు. దీంతో ఇది ఇంటికి సంతోషాన్ని, శ్రేయస్సుని తెస్తుంది.


Comments
 -Advertisement-