రథసప్తమి సూర్యుడికి ప్రత్యేక పూజలు
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వైరా: పట్టణంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునారు. మాఘ శుక్ర సప్తమి నుంచి సూర్య కిరణాలు తీవ్రత పెరగడం వల్ల వాతావరణ మార్పులు సంభవిస్తాయి. భక్తులు జిల్లేడు ఆకులతో స్నానం చేసి ఔషధ గుణాలు వాతావరణ మార్పుల వల్ల వచ్చే చర్మ వ్యాధులు అనారోగ్యాల నుంచి రక్షిస్తాయని నమ్మకం జిల్లేడు ఆకులు సూర్యుడికి ఎంత ప్రీతికరమైన వీటిని అర్క్ పత్రాలను కూడా అంటారు. రథసప్తమి పవిత్రమైందని కాబట్టి సంక్రాంతి మూడు రోజులు గోమయంతో చేసిన గొబ్బెమ్మలపైన గోక్షరంతో చేసిన పరమాన్నం నవేద్యాన్ని సూర్యభగవాన్ నునికి సమర్పించారు. ఫలితంగా ఆయన సంతృప్తి చెందుతాడనిభక్తులు నమ్మకం రథసప్తమి శిశిర రుతువులో వస్తుందని శిశిర్యానికి ముందు హేమంత్ రుతువులు చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. శుక్రవారం భక్తులు ప్రతి ఒక్కరు తెల్లవారుజామునే మేల్కొని శిరస్సు భుజాలపై జిల్లేడు ఆకులు ఉంచుకొని సప్త సప్త మహాసప్త సప్త దీప వసుంధర సప్తర్క రమాధార సప్తమి శ్లోకాన్ని పటిస్తూ తన స్థానం చేశారు. రథసప్తమి రోజు సూర్యుని ఆరాధించారు. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి పండుగ ఇదే రథసప్తమి నాడు ముంగిట్లో రథం ముగ్గులు వేసి తీర్చిదిద్దారు ఉదయాన్నే మహిళలు ఇంటిలిపాది స్థానాలు చేసి సూర్యుని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. గాయత్రి జపం ఆదిత్య హృదయం సూర్యాష్టకం సూర్య సహస్రలాంటి స్తోత్రాన్ని పట్టించి పూజలు నిర్వహించారు. సూర్యుని పూజించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుందని కృష్ణయ్య జురువేదం కూడా వివరిస్తుందని ఆదిత్య రూపంలో వాత పిత్త రోగాలని సర్వ శాస్త్ర బాధలు సుఖ ప్రసవాన్ని ఇస్తాయని కూడా పురాణాల ప్రకారం పూజించారు. అనంతరం సూర్య నమస్కారాలు యోగాసను ప్రాణయామం మంత్రం చక్ర ధాన్యం చేసి సంపూర్ణ సాధన సూర్య నమస్కారాలకు బ్రహ్మ ముహూర్తము లేచి వేకుజాము నే ఫలితం ఉంటుందని మీరు నమ్మకం వైరా లోని అన్ని దేవాలయాల్లో భక్తులకు తీర్థ ప్రసాదములు అందించారు తెల్లవారుజాము నుండే భక్తులు దేవాలయాలకు చేరుకుని పూజలు నిర్వహించి ప్రసాదములు స్వీకరించారు.
Comments