ఇసుక అక్రమ రవాణాకు అడ్డు చెప్పేదేవరు..?
By
Vaasthava Nestham
- కూపన్ ఒక్కటే.. ట్రిప్పులు అనేకం..?
వాస్తవ నేస్తం,బోనకల్: మండల పరిధిలోని రాయన్నపెట ఇసుక రేవు నుంచి రోజుకు పదుల సంఖ్యలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా కొంతమంది ఇసుక మాఫియా ముఠా గుట్టు చప్పుడుగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. గత వారం రోజులుగా ట్రాక్టర్ల ద్వారా జోరుగా ఇసుక రవాణా జరుగుతున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం ఏ మాత్రం(sand business) పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అక్రమ ఇసుక రాత్రి పగలు తేడా లేకుండా ఒక్క కూపన్ నుంచి నాలుగైదు ట్రిప్పుల ఇసుకను బయట వ్యక్తులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. అక్రమార్కులు నిత్యం ఇసుకను తరలించడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాకుండా ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి ఇసుక కొరత ఏర్పడనుందని మండల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి( illegal sand business) అక్రమ ఇసుక రవాణా కు అడ్డు కట్ట వెయ్యాలని ప్రజల కోరారు. ఇట్టి విషయంపై తాహాసిల్దార్ అనిశెట్టి పున్నం చందర్ ను వివరణ కోరగా.. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక కూపున్ కు ఒక ట్రిప్పు ఇసుకకు మాత్రమే అనుమతి ఉందని, కూపన్ లో ఉన్న సమయంలోనే లోపాలు జరపాలని అన్నారు. ఇదే విషయమై పోలీసు అధికారులతో కూడ చర్చించినట్లు తెలిపారు.
Comments