ఆకలి బాధ తట్టుకోలేక పిల్లి పచ్చిమాంసం తిన్న విద్యార్థి..!
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఆకలి మనిషిని ఎంతటి పనిచేస్తుందో అని అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉత్తర కేరళలోని Kerala కుట్టిప్పురంలో ఘటనే తాజా ఉదాహరణ. బస్ స్టేషన్లో ఓ విద్యార్థి చనిపోయిన పిల్లి పచ్చి మాంసం తిన్నాడు. ఈ ఘటనను చూసిన జనం ఒక్కసారిషాక్ అయ్యారు. Assam అస్సాంకు చెందిన ఓ విద్యార్థి రోజుల తరబడి ఆహారం లేక పిల్లి పచ్చిమాంసాన్ని తినడం కనిపించింది. శనివారం సాయంత్రం రద్దీగా ఉండే బస్టాండ్ లో కూర్చుని పిల్లి మాంసాన్ని తినడం అక్కడి జనాలను గమనించారు. ఆ విద్యార్థిని అస్సాం రాష్ట్రానికిచెందినవాడుగా గుర్తించాడు. బస్టాండ్ మెట్లపై కూర్చని పిల్లిమాంసం తింటున్నట్లు స్థానికులు గమనించారని..ఓ పోలీస్ అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న తర్వాత ఘటన స్థలానికి చేరుకుని అతన్ని విచారిస్తే గత ఐదురోజులుగా ఎలాంటి ఆహారం తినలేదని..చెప్పినట్లు పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి అస్సాంలోని ఓ కళాశాల విద్యార్థిగా గుర్తించారు. ఇంట్లో చెప్పకుండా ట్రైన్ ఎక్కి డిసెంబర్ లో కేరళకు వచ్చాడని తెలిసింది. విచారణలో చెన్నైలో పనిచేస్తున్న అతని సోదరుడి మొబైల్ నెంబర్ ఇచ్చినట్లు ..అతన్ని సంప్రదించి వివరాలు ధ్రువీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం యువకుడిని త్రిసూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. యువకుడికి శారీరక, మానసిక సమస్యలు లేవని, కుటుంబ సభ్యులు ఇక్కడికి రాగానే వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
Comments