-Advertisement-

సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు మేయర్ కు ఆహ్వానం

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,కుత్బుల్లాపూర్: నిజాంపేట్ 20వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్, ఎన్ఎంసి బిఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ రాములు నాయక్, సేవాలాల్ బంజారా సేవ సంఘం సభ్యులుతో నేడు మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి. 
ఈ సందర్భంగా ఈనెల 15న సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వారి ఆధ్వర్యంలో నిర్వహించే జయంతి వేడుకలకు ముఖ్య అతిధులుగా మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు రాంచందర్ నాయక్, రవి నాయక్, గోపాల్ నాయక్, రవి నాయక్, పాండు నాయక్, గోపాల్ నాయక్, ఇతర ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-