-Advertisement-

ఏసీబీ కి చిక్కిన ఎస్సై సురేష్

Vaasthava Nestham
- ప్రేమ వ్యవహారం కేసులో బాధితుల నుండి 50 వేలు డిమాండ్
- ఎస్సైని పట్టుకున్న ఏసీబీ అధికారులు

వాస్తవ నేస్తం,మహ్మదాబాద్: లంచం తీసుకుంటూ ఏసీబీకి ఎస్సై చిక్కాడు .వివరాల్లోకి వెళితే. రంగారెడ్డి జిల్లాలోని మహ్మదాబాద్ మండలం పగిడాల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారు ని ప్రేమ వ్యవహారంపై మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఎస్సై సురేష్ రూ.50 వేలు డిమాండ్ చేశారు. బాధితులు ముందస్తుగా రూ.30 వేలు చెల్లించారు. మిగతా నగదు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న జిరాక్స్ సెంటర్ యజమాని మూసాకి 20,000 డబ్బులు చెల్లించాలని, లేనియెడల మీ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేస్తామాని ఎస్సై బెదిరింపులకు పాల్పడడంతో కృష్ణారెడ్డి ఏసీబీ అధికారులు సంప్రదించారు. ఆదివారం జిరాక్స్ యాజమానీ మూసాకి బాధితులు 20 వేల డబ్బు చెల్లిస్తూ ఉండడంతో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. ఎస్సై సురేష్ పై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Vaasthava Nestham Telugu Daily

Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.