ఓకే గ్రామంలో ఐదుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు... ప్రశంసిస్తున్న గ్రామస్తులు
Government jobs for five people in one village
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ముధోల్: కుభీర్ మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన ఐదుగురు ప్రభుత్వ కొలువులు సాధించడంతో గ్రామస్తులు పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ గురుకుల ఉపాద్యాయుల పోస్టులు, పోలీస్ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా టాపర్ గా కూడ నిగ్వా గ్రామానికి చెందిన కుంటాల రవీందర్ (లైబ్రేరియన్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులు మీదుగా అవార్డ్ అందుకున్నాడు. అదే విధంగా జాడే కాంతబాయి (పిజిటి హిందీ), నక్కొల్ల కల్యాణి (పిజిటి ఇంగ్లీష్), జాడే స్రవంతి (ఏఆర్ కానిస్టేబుల్), ముల్క సాయి ప్రసాధ్ ( ఫైర్ కానిస్టేబుల్) ఇలా మొత్తం ఒకే గ్రామానికి ఐదు ఉద్యోగాలు రావడం మా గ్రామానికి గొప్ప గర్వకారణమని గ్రామ పెద్దలు ఉద్యోగాలు పొందిన వారిని ప్రశంసిస్తున్నారు. ఓకే గ్రామానికి చెందిన ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి నిగ్వా గ్రామంతో పాటు జిల్లా పేరు నిలపెట్టరు అని చెప్పవచ్చు.
Comments