-Advertisement-

Chhatrapati Shivaji Maharaj: శివాజీ జీవిత చరిత్ర, శివాజీ మహారాజ్ చేసిన యుద్ధాలు, పరిపాలన విధానం...

who defeated shivaji maharaj shivaji maharaj story how shivaji maharaj died when was shivaji maharaj born who did shivaji maharaj fight against
Vaasthava Nestham
శివాజీ గొప్ప యోధుడు(Chathrapati Shivaji), పరాక్రమవంతుడు. శివాజీ ను ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కూడా పిలుస్తారు. శివాజీ భారతదేశానికి చెందిన పాలకుడు మరియు భోంస్లే మరాఠి వంశానికి చెందిన వారు. క్షీణిస్తున్న బీజాపూర్ Bijapur ఆదిల్ షాహి సుల్తాన్ యొక్క సామ్రాజ్యం నుంచి శివాజీ తన సొంత స్వతంత్ర రాజ్యాన్ని రూపొందించారు. ఇలా మరాఠా సామ్రాజ్యం యొక్క స్థాపన జరిగింది.1674 వ సంవత్సరంలో రాయగడ్ కోట లో అధికారికంగా ఛత్రపతి కిరీటాన్ని పొందారు.

శివాజీ మహారాజ్ బాల్యం: Childhood of Shivaji Maharaj


శివాజీ 19 ఫిబ్రవరి 1630 వ సంవత్సరంలో పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో ( Chatrapati Shivaji Maharaj father name Shahaji Bosle ) షాహాజీ, ( Chhatrapati Shivaji Maharaj mother name jijiya bai ) జిజియాబాయి దంపతులకు జన్మించారు. శివాజీ Chhatrapati Shivaji Maharaj ఫిబ్రవరి 19వ తేదీన జన్మించడంతో దేశవ్యాప్తంగా శివాజీ యొక్క జన్మదిన ఘనంగా నిర్వహిస్తారు. శివాజీ కుటుంబం మహారాష్ట్రలోని వ్యవసాయం చేసే భోంస్లే కులానికి చెందిన వారు. శివాజీ తల్లి యాదవ క్షత్రియ వంశానికి చెందిన వారు. శివాజీ కంటే ముందు పుట్టిన పిల్లలు చనిపోవటంతో తల్లి తాను పూజించే దేవత శివై పేరు మీద శివాజీ అని పేరు పెట్టారు. శివాజీ యొక్క Shivaji grandfather Maloji తాత మాళోజి డెక్కన్ లో ఉన్న అహ్మద్ నగర్ సుల్తాన్ వద్ద ప్రభావవంతమైన జనరల్ గా ఉన్నారు. ఈయనకు దేశముఖి అనే బిరుదును కూడా ఇవ్వటం జరిగింది. శివనేరి కోట లో తన కుటుంబం తో పాటు ఉండేందుకు కూడా అనుమతి లభించింది. Shivaji Maharaj శివాజీ తండ్రి షాహాజీ నిజాంషాహీల రాజుల వైపు ఉంటూ మొగల్ రాజులకు వ్యతిరేక యుద్ధాలలో పాల్గొనే వారు. నిజాంషాహీల పైన షాజహాన్ దండయాత్ర చేసిన సమయంలో షాహాజి సైన్యాన్ని బలోపేతం చేయటంలో కీలక పాత్ర వహించాడు. మొగల్ రాజులకు వ్యతిరేకంగా పోరాడటంతో మొగల్ సైన్యం నిరంతరం షాహాజి వెంటపడేవారు. షాహాజి తన కొడుకు శివాజి మరియు భార్య జీజాబాయ్ తో కలిసి ఒక కోట నుంచి ఇంకో కోటకు తరచూ మారుతూ ఉండేవారు. 1636 వ సంవత్సరంలో బీజాపూర్ రాజు వద్ద పనిచేస్తున్న సమయంలోషాహాజి పూనా ను దక్కించుకున్నారు. శివాజి మరియు jijiya bai జీజాబాయ్ పూణే లోనే స్థిరపడ్డారు. Bijapur బీజాపూర్ రాజు ద్వారా షాహాజి బెంగళూరు కి తరలించబడ్డారు. షాహాజి పూణే pune యొక్క పాలన అధికారిగా డాడోజీ కొండేడియో ను నియమించారు.1647 వ సంవత్సరంలో కొండేడియో చనిపోయిన తరవాత శివాజీ అధికారాన్ని చేపట్టారు. Bijapur బీజాపూర్ రాజుకి వ్యతిరేకంగా నిలబడ్డారు.

శివాజీ చేసిన యుద్ధాలు.. Wars fought by Shivaji Maharaj 


శివాజీ యుద్ధ రణనీతిని మాళోజి, తన తండ్రి షాహాజీ దగ్గర నేర్చుకుని ఎన్నో యుద్ధాలు చేసి విజయం సాధించాడు. శివాజీ యొక్క యుద్ధ రణనీతి ప్రత్యర్థి రాజుల వెన్నులో వణుకు పుట్టించేది. 

సుల్తానులతో యుద్ధం:


Chhatrapati Shivaji Maharaj 17 ఏళ్ల వయసులోని మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తుర్మ తోర్న ను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్లలో కొండన, రాజ్ ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతమంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

సూరత్ యుద్ధం: Battle of Surat


1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపారకేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. అపారమైన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేలమందిని తన సైన్యంలో చేర్చుకొన్నాడు. కొద్దిరోజుల్లో మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. ఇది చూసిన ఔరంగజేబు war between Aurangabad and Shivaji ఆగ్రహోద్రుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడయిన రాజా జై సింగ్ ను శివాజీ Shivaji Maharaj పైకి పంపించాడు. రాజా జై సింగ్ గొప్ప రాజ నీతిజ్ఞుడు. రాజా జై సింగ్ అద్వర్యంలో మొఘల్ సేనలు మొదట పురంధర్ దుర్గాన్ని ఆక్రమించాయి. తర్వాత రాయఘర్ ఆక్రమనకై సేనలు ముందుకు సాగుతుండగా ఓటమి గ్రహించిన శివాజీ రాజ జై సింగ్ తో సంధి కి దిగాడు.1665 లో శిబాజి రాజా జై సింగ్ తో పురంధర్ వద్ద సంధి చేసుకున్నాడు. (Battle of Surat) తర్వాత కూడా ను కూడా ఒక మొఘల్ సర్దార్ ఉండడానికి అంగీకరించాడు. మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకొని తన శతృవులయిన బిజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించడానికే శివాజీ మొఘల్ సర్దార్ ఉండడానికి ఒప్పుకున్నాడు.

పవన్ ఖిండ్ యుద్ధం: Battle of Pavan Khind


రెండుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న అదిల్షా మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమయిన సైనిక, ఆయుధ బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు. ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్హాలా కోటలో శివాజీ Shivaji Maharaj కొన్ని వందలమంది అనుచరులతో ఉన్నాడు. సిద్ది జోహార్ విషయం తెలుసుకొన్న శివాజీ Shivaji Maharaj ఎలాగయినా పన్హాలా కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాలఘడ్ కోటకు చేరుకొంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు.( Battle of Pavan Khind )కానీ అప్పటికే పన్హాలా కోట చుట్టూ శత్రుసైన్యం ఉండడంతో తాను యుద్ధానికి సిద్దంగా లేనని దయతలచవలసినదిగా సిద్ది జోహార్కు వర్తమానం పంపాడు. అది తెలుసుకొన్ని సిద్ది జోహార్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకొంటుంటే, శివాజీ Shivaji Maharaj తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోటవైపు పయనించసాగాడు. చివరిక్షణంలో ఇది తెలుసుకొన్న సిద్ది జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించసాగాడు. ఇలా శివాజీ ఎన్నో యుద్ధాలు చేసి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించి తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకొని పరిపాలన కొనసాగించారు.



Comments
 -Advertisement-