-Advertisement-

Dangerously hanging electrical wires: ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు

Vaasthava Nestham

- ప్రాణ నష్టం జరిగితే బాధ్యులు ఇవ్వరు..?


వాస్తవ నేస్తం,లోకేశ్వరం: నిలబడితే తాకే ఎత్తులో వేలాడుతున్న విద్యుత్‌ తీగలను చూసి గల్లీ వాసులు, భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ తీరని పైకి లాగాలని కోరుతున్నారు విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షించడంలేదు. దీంతో కరెంట్‌ షాక్‌ ప్రమాదాలు తరచూ జరుగుతున్నా సంబంధిత శాఖ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బిల్లుల వసూలుపై ఉన్న శ్రద్ధ సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపడలంలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఆ గల్లీలో ఓ టెంట్ వెయ్యాలన్న ఇంట్లోకి ఓ వెహికల్ వెళ్లాలన్న వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ సమస్యపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామంలో కొన్ని నెలలుగా విద్యుత్ తీగలు నిలబడితే తాకే ఎత్తులో వేలాడుతున్నాయి. గల్లీ వాసులు విద్యుత్ తీగలతో ఇబ్బంది పడుతూ ఎన్నిసార్లు విన్నవించిన ఎటువంటి మరమ్మతులు చేయలేకపోతున్నారని వాపోతున్నారు. నిలబడితే తాకే ఎత్తులో వ్రేలాడుతున్న విద్యుత్తు తీగలను సరి చేయాలంటూ పలుమార్లు విద్యుత్తు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గల్లీ వాసులు పేర్కొన్నారు. ఈ విషయం గల్లి వాసులు కురుమే బాబన్న, ఈర్ల నడిపి భోజన్న, పోతన, శ్రీనివాస్, దేవిదాస్ తెలియజేశారు. నెల నెలా విద్యుత్తు బిల్లులను వసూలు చేయడంపై అధికారులు చూపుతున్న శ్రద్ధ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరి చేయడంలో లేదు. విద్యుత్తు తీగలను సరి చేసి ప్రమాదాలు జరుగకుండా చూడాలి.
Comments
 -Advertisement-