-Advertisement-

Forest officers suspend: ఆరుగురు అడివిశాఖ ఉద్యోగాల సస్పెన్షన్ వేటు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: అటవీ శాఖలో ఆరుగురు(six members Forest officers suspend) ఉద్యోగులను సస్పెన్షన్ చేస్తూ ఉన్నత అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ఆరుగురు ఉద్యోగులపై వేటు వేశారు. 
విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం డివిజన్ ఇంధనపల్లి రేంజి కవ్వాల్ ఫారెస్ట్ సెక్షన్ బీట్ అధికారులు అఫ్జల్ ఖాన్, శ్రీధర్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఇస్లాంపూర్ వేస్ట్ కొత్తపల్లి అటవీశాఖ సెక్షన్ అధికారులు వినయ్ కుమార్, ఇమ్రాన్, నిర్మల్ జిల్లా ఉండుపూర్ రేంజ్ పరిధిలోని ఇస్లాంపూర్ ఈస్ట్ ఫారెస్ట్ సెక్షన్ బిట్ ఆఫీసర్లు రవికుమార్, భూమేష్ లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.