Govt to sell Bharat Rice in retail market: కిలో రూ.29 బియ్యం.. భారత్ రైస్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం
Govt to sell Bharat Rice
Central Government implement Bharat Rice
Bharat Rice scheme launched
Govt to sell Bharat Rice in retail market at ₹29 a kg
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: రోజురోజుకు బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేద ప్రజలు బియ్యం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. బియ్యం ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం అమలు ద్వారా బియ్యం ధరలను అదుపు చేసేందుకు ఈ ప్రయత్నం మొదలుపెట్టింది.(Govt to sell Bharat Rice in retail market at ₹29 a kg) భారత్ రైస్ పేరుతో కిలో రూ.29 చొప్పున బియ్యం అమ్మకాలను చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అయితే..
ఈ విక్రయాలు వచ్చే వారం నుంచే ప్రారంభం అవ్వనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు.
Bharath rice scheme దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఈ పథకం ఊరట నివ్వనుంది. మరోవైపు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినా కూడా 15 శాతం మేర ధరలు పెరిగాయని సంజీవ్ చోప్రా వెల్లడించారు. నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో బియ్యాన్ని విక్రయిస్తామని ఆయన తెలిపారు. అంతేకాక ఈ-కామర్స్ వేదికగా కూడా భారత్ రైస్‌ను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. Bharath rice scheme ఈ రైస్‌ను 5 కేజీలు, 10 కేజీల బ్యాగులుగా భారత్ రైస్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. రిటైల్ మార్కెట్‌లో తొలి దశలో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని సంజీవ్ చోప్రా చెప్పారు. మరోవైపు బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తారన్న వార్తలపై కూడా సంజీవ్ చోప్రా క్లారిటీ ఇచ్చారు. ధరలు అదుపులోకి వచ్చే వరకూ ఈ నిషేధం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోము అని చెప్పారు. అలాగే.. రిటైలర్లు, హోల్‌సేలర్లు, ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం స్టార్ వివరాలను మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని సంజీవ్ చోప్రా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంతో మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు లాభం చేకూరుతుందని చెప్పొచ్చు.
User
Comment Poster
Supper
Vaasthava Nestham
Replied
✅
Reply to This Comment
Comments