-Advertisement-

Hyderabad: అడిగిన చోట బస్సు ఆపలేదని కండక్టర్‌ని చెప్పుతో కొట్టింది..

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే మహిళల సంఖ్య మునిపటి కంటే ఎక్కువ పెరిగింది. ఈ క్రమంలోనే డ్రైవర్లు, కండక్టర్లు కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్న సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇదే కోవకు చెందిన సంఘటన హైదరాబాద్ సిటీ బస్సులో శనివారం జరిగింది. 
Telangana RTC Telangana government implement Mahalakshmi scheme 
మెహదీపట్నం నుండి ఉప్పల్ వెళ్లే 300 నెంబర్ బస్సు లో ఓ మహిళ ప్రయాణీకులు హల్ చల్ చేసింది. తాను అడిగిన చోట బస్సు ఆపలేదని కండక్టర్ పై దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గత నెల(జనవరి) 25వ తేదీన ఆర్టీసీ కండక్టర్ ని బూతులు తిట్టిన మహిళ ఘటన మరవక ముందే. తాజాగా రాజేంద్రనగర్ లో సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రసన్న అనే మహిళా ప్రయాణికురాలు రెచ్చిపోయింది. అంతేకాదు బస్సు కండక్టర్ నరసింహ పై దాడి చేసింది. చెప్పు తీసుకొని కండక్టర్ చెంపలు వాయించింది ప్రసన్న. తాను అడిగిన చోట బస్సుని నిలపలేదనే కోపంతో కండక్టర్ ని దుర్భాషలాడుతూ.. ప్రసన్న విచక్షణారహితంగా దాడి చేసి చెప్పు తో కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు కండక్టర్ నరసింహ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ప్రయాణీకురాలు ప్రసన్నపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ మహిళా ప్రయాణీకురాలు ప్రసన్న శివరాంపల్లికి చెందిన ఆమెగా గుర్తించారు.
Comments
 -Advertisement-