-Advertisement-

Rachakonda police commissionrate: పాత ఆటోలు, బైకులకు వేలం పాట..

Vaasthava Nestham
పాత ఆటోలు, బైకుల వేలంపాటకు సిద్ధమైన రాచకొండ పోలీస్ కమిషనర్

వాస్తవ నేస్తం,హైదరాబాద్: వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పాడైపోయిన ఆటోలు, బైకులను వేలం వేయడానికి సిద్దమయ్యారు రాచకొండ పోలీస్ కమిషనర్. ఇప్పటి వరకూ ఆటోలు, బైకులు రెండూ కలిపి 235 ఉన్నట్లు తెలిపారు.
Auction of old autos and bikes
ట్రాఫిక్కు అడ్డంగా, నో పార్కింగ్ ప్రదేశాల్లో వదిలేసి వెళ్లి ఎంతో కాలంగా తిరిగి విడిపించుకోని వాటిని అంబర్‌పేటలోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంచి వేలంపాటకు పోలీసులు సిద్ధమయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ వాహనాలను వేలం వేస్తారని ఒక ప్రకటన చేశారు. వీటిని వేలం వేసే లోపు సంబంధిత యజమానులు వచ్చి క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. వాహనాలపై ఉన్న ఫైన్ ప్రభుత్వానికి చెల్లిస్తే వాటిని నిజమైన యజమానులకు తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు.
Rachakonda police commissionrate
వాహనాలను వేలం వేయాలనే నిర్ణయం రాచకొండ, R/w చట్టంలోని సెక్షన్ 22(1) (a) నుండి (f), 22(2) (a) to (b) తో పాటు 22(3) (No. IX) ప్రకారం వర్తిస్తుందని పేర్కొన్నారు పోలీసు ఉన్నతాధికారులు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348-ఎఫ్ సెక్షన్ 39(బి), 40 & 41 ప్రకారం వదిలివేయబడిన ఈ వాహనాలు ఎవరివి అని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. వాటి గురించి వివరణాత్మక సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో "సిటిజన్ సర్వీసెస్ - అబాండన్డ్ వెహికల్స్ - 2024" విభాగంలో అందుబాటులో ఉంచారు.

ఈ ప్రకటన వెలువడిన నాటి నుండి ఆరు నెలల వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. ఈలోపు తగిన పత్రాలు చూపించి, సరైన సాక్ష్యాలు పొందుపరిచి వాహనాల యజమానులు తమ వాహనాలను తీసుకెళ్లచ్చని చెప్పారు. దీనిపై మరింత సహాయం, సమాచారం కొరకు రాచకొండలోని DCP CAR ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాలని పేర్కొన్నారు. అలాగే అంబర్‌పేట కార్యాలయంలో 8712662661, 8008338535 నంబర్‌లకు కాల్ చేసి పోలీసులను సంప్రదించవచ్చు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించే గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నేటితో ఆ గడువు కూడా ముగియనుంది. ఈ క్రమంలో ఈ వేలం నిర్ణయం తీసుకోవడంతో వాహనాల యాజమానులు తమ వాహనాలను విడిపించుకునేందుకు ఆసక్తిచూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో వాటిపై ఉన్న జరిమానాలు కూడా ప్రభుత్వానికి చేకూరే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం రానుంది.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.