-Advertisement-

Sangareddy: శిక్షణలో అన్ని మెళుకువలు నేర్చుకోవాలి: అదనపు ఎస్పీ సంజీవ రావ్

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,సంగారెడ్డి: జిల్లా పోలీసు శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చే విధంగా క్రమశిక్షణతో నడుచుకోవాలని ట్రైనీ కానిస్టేబుళ్ళకు సూచించిన జిల్లా అదనపు ఎస్పీ సంజీవ రావ్ సూచించారు. పోలీసు ఉద్యోగాలకు ఎంపికై శిక్షణ కొరకు వెళుతున్న అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పోలీస్ కానిస్టేబుళ్లు గా ఎంపికై బేసిక్ ట్రైనింగ్ లో భాగంగా పిటిసి మేడ్చల్, పిటిసి వరంగల్, డిటిసి నల్గొండ, డిటిసి అదిలాబాద్, సిటిసి కరీంనగర్ వివిధ ట్రైనింగ్ సెంటర్లకు వెళుతున్న మొత్తం 472 మంది స్టయిఫండరీ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లకు కిట్ ఆర్టికల్స్ అందజేశారు. శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ భాస్కర్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ లు నాయక్, ఆర్.ఎస్.ఐ. మహేశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ వెంకటేశం, అశోక్ మినిస్టీరియల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
Comments
 -Advertisement-