-Advertisement-

sevalal Maharaj history: బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్

sevalal maharaj history in telugu sevalal maharaj death date sevalal maharaj father name sevalal maharaj birth date sant sevalal maharaj book
Vaasthava Nestham
సంత్ సేవాలాల్ మహారాజ్ ను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారు. ఆయన జయంతిని పండుగలా జరుపు కొంటారు. గిరిజ నులకు చైతన్యం కలిగించి, వారికి దశ - దిశను చూపి, హైందవ ధర్మం గొప్పదనం, విశిష్టతలను తెలియ జేయడానికే సేవాలాల్ మహారాజ్ జన్మించారని పేర్కొంటారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేసి, సంత్ సేవాలాల్ ఇతర కులాల వారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారు. 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా రాంజీనాయక్ తండాలో సేవాలాల్ మహారాజ్ జన్మించారు. 
జగదాంబ మాతనే తన మార్గ దర్శకురాలిగా, గురువుగా స్వీకరించి ఆమె ఆదేశానుసారం బంజారాల సేవలో నిమగ్న మయ్యారు. (Sevaalaal Maharaj jayanti) సేవా లాల్ ప్రజల మూఢ విశ్వాసమైన జంతుబలికి తీవ్ర వ్యతిరేకి, బంజారాలు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు బంజారాలు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగించే వారు. ఆ క్రమంలో బ్రిటిష్, ముస్లిం పాలకుల మత ప్రచారంతో బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురయ్యింది. అలాంటి పరిస్థితులలో బంజారాలను మంచి మార్గంలో నడిపించడానికి సేవాలాల్ అవతరించారని చెపుతారు. సాతీ భవానీ (సప్తమాతృకల) పూజా విధానాలు ఆచరించే బంజారాల జాతికి ఆయనే దార్శనికుడు. ఆయన బోధనల ద్వారా బంజారా జాతి నడచుకుంది. 

బంజారాల కోసం సేవాలాల్ మహరాజ్ చేసినా ఉద్యమాలు...


Sevalal Maharaj did movements for Banjaras
లిపిలేని బంజారాల భాషను ఒక పద్ధతిగా మార్చాడు. సేవాలాల్ శివ పూజారి, ఆయన తండ్రి, తాతలు తెగ పెద్దలు. తొమ్మిది రోజుల పాటు పెళ్లికాని యువతులు తీజ్ ఉత్సవాల్లో పాల్గొని తమకు వివాహం కావాలని పూజలు చేయడం తీజ్ ఉత్సవ సాంప్రదాయం. సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రజల కోసం చేసిన ఉద్యమాలలో ధర్మ ప్రచారం, ఆర్ధిక సంస్కరణలు, మత మార్పిడులను అరికట్టడం వంటివి ఉన్నాయి. (sevalal Maharaj history)సన్మార్గంలో తన జాతిని నడిపించి భారత దేశంలోని దాదాపు10 కోట్లకు పైగా బంజారాలకు ఆరాధ్య దైవంగా ఆయన నిలిచారు. సేవాలాల్ మహరాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో 'పెరిఫర్' ఒకటి. ధర్మ ప్రచారం, ఆర్ధిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి. అహింస మహా పాపమని, మద్యం, ధూమ పానం శాపమని హితవు పలికాడు. ఆ రోజుల్లో నే బంజారాల పరువు ప్రతిష్టల గురించి ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేశాడు. 

సంత్ సేవాలాల్ మహరాజ్ మహిమలు అద్భుతం..


The glories of Sant Sevalal Maharaj are wonderful
సంత్ సేవాలాల్ మహరాజ్ మహిమలు అద్భుతమైనవిగా చెప్పుకుంటారు. మహిమల గురించి అనేక కథనాలు ఉన్నాయి. వాటిలో పురుషున్ని స్త్రీగా మార్చడం, ఒక ముంత బియ్యంతో 10,000 మందికి భోజనాలు పెట్టడం, చనిపోయిన వ్యక్తిని మూడు దినాల తరువాత బ్రతికించడం, విషం కలిపిన తీపి వంటకాలను నిర్వీర్యం చేయడం. ఉదృతంగా పారే ప్రవాహాన్ని ఆపి తమ తండా ప్రజలను, ఆవులను దాటించడం లాంటి మహిమలను ప్రదర్శించారని చెపుతారు. బంజారాలు ఎవరికీ హాని తలపెట్టేవారు కాదని, సహాయ గుణం విరివిగా కలవారని, ధైర్య సాహసాలకు ప్రతీకలనీ చరిత్ర ద్వారా స్పష్టం అవుతున్నది. బంజారాలు రాజపుత్రుల వలె ధృఢ కాయులని, చరిత్ర కారుడు కల్నల్ టాడ్ పేర్కొన్నాడు. మధ్య యుగంలో మహమ్మద్ ఘోరీకి వ్యతిరేకంగా పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యంలో బంజారాలు వీరోచితంగా పోరాడి నట్లు చరిత్ర చెపుతున్నది. దక్కన్ పీఠభూమిలో లంబాడీలు కాకతీయుల కంటే ముందే ఉన్నారని, సంచార జాతివారైనా వీరు రజాకార్లతో పోరాడారని, నవాబులు వారి ధైర్యసాహసాలకు మెచ్చి భూములను ఇనాములుగా ఇచ్చారని గ్రంథస్థం అయిఉంది. సభ్య సమాజానికి బహు దూరంగా, అడవి తల్లి ఒడిలో ఉంటూ, అటవీ వనరులపై ఆధార పడుతూ, ప్రత్యేక జీవన విధానం కలిగి ఉన్న, అంతగా అభివృద్ధి చెందని తెగల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు ప్రణాళికా బద్ద కార్యక్ర మాలు అమలు చేస్తున్నా, ఇంకా చేయాల్సిన అవసరం అనివార్యం గా ఉంది. తరతరాలుగా జాతి వివక్షకు గురవుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధిలో వెనుకబడి ఉన్న లంబాడాలను అభివృద్ధి చేయాల్సిన అవసరముంది.
Comments
 -Advertisement-