-Advertisement-

Types of Budgets: బడ్జెట్ ఎన్ని రకాలు అంటే...

Types of budgets Types of budgets in accounting What are the 4 types of budgets Types of budgets with examples
Vaasthava Nestham
బడ్జెట్ ఎన్ని రకాలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం. బడ్జెట్ మూడు రకాలు. సంతులిత బడ్జెట్, మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్ లలో ఏది మంచిది.? మన దేశానికి ఎలాంటి బడ్జెట్ కావాలి.? తెలుసుకుందాం పదండి.

సంతులిత బడ్జెట్ A balanced budget


ప్రభుత్వ బడ్జెట్ సంతులితంగా ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతారు. ఒక ఆర్థిక సంవత్సరంలో కేంద్ర Central Government budget సర్కారు ఆదాయం, అలాగే ఖర్చులు సమానంగా ఉంటే దాన్ని బ్యాలెన్స్‌డ్ (సంతులిత) బడ్జెట్ అని వ్యవహరిస్తారు. ఖర్చులు ఎప్పుడూ ఆదాయాన్ని మించరాదనేది ఆర్థికవేత్తల లెక్క. బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ వల్ల ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది. అయితే ఆర్థిక వృద్ధి పరిమితంగానే ఉంటుంది. ఈ తరహా బడ్జెట్‌ను అమలు చేయడం కత్తి మీద సామే. ఆర్థిక మందగమనం తలెత్తితే.. ఈ బడ్జెట్‌ను అమలు చేయడం సాధ్యం కాదు.

మిగులు బడ్జెట్ surplus Budget


బడ్జెట్ వ్యయ అంచనాల కన్నా రెవెన్యూ అంచనాలు ఎక్కువగా ఉన్నప్పుడు.. దానిని మిగులు బడ్జెట్‌గా పిలుస్తారు. ఖర్చులతో పోలిస్తే ఆదాయం ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలతో ఈ బడ్జెట్‌ను రూపొందిస్తారు. అంటే ప్రజల నుంచి వసూలు చేసే ఎక్కువగా ఉన్నా.. వారిపై ప్రజలు చేసే తక్కువగా ఉంటుందన్న మాట

లోటు బడ్జెట్ Deficit budget

మిగులు బడ్జెట్‌కు ఇది పూర్తిగా వ్యతిరేకం. ప్రభుత్వానికి లభించే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలతో రూపొందిస్తారీ బడ్జెట్ ను. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు లోటు బడ్జెట్ చక్కగా సరిపోతుంది.
Comments
 -Advertisement-