-Advertisement-

ఫలహారం పంచుకున్నది అందరూ.. తప్పించుకుని తిరుగుతున్నది కొందరు..!!

Vaasthava Nestham
- లక్కీ స్కిమ్ పేరిట ప్రజలను దోచుకున్న ప్రబుద్ధులు
- మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించిన కోర్టు
- జర్నలిస్టులమంటూ ప్రజలకు పంగనామం
- ఇల్లీగల్ లక్కీ స్కీంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా రిపోర్టర్లను తొలగించని యజమాన్యాలు
- మావి ప్రధాన పత్రికలు అని చెప్పుకుంటూ ఇల్లీగల్ దండాలు
- ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఓ రిపోర్టర్ ప్రధాన సూత్రధారి
- పోలీసులకు పట్టుబడిన కూడా చాకచక్యంగా తప్పించుకున్న ప్రబుద్ధుడు
- లక్కీ స్కీంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న అందరిపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్
- ఆ.. దినపత్రిక రిపోర్టర్ ను యజమాన్యం తొలగించకపోవడంతో ప్రజల్లో అసహనం

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: మావి ప్రధాన పత్రికలు అంటూ లక్కీ స్కీమ్ పేరిట ప్రజలను దోచుకున్న కొందరు దినపత్రిక రిపోర్టర్లు లక్కీ డ్రా నిర్వహిస్తుండగా నిర్మల్ జిల్లాలోని మహబూబ్ ఘాట్ లలో పోలీసులు పట్టుకున్నారు. లక్కీ స్కీం లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న కొందరు రిపోర్టర్లు, మరికొందరిపై 2020 సంవత్సరంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి బుధవారం లక్కీ స్కీమ్ ప్రజలను దోచుకున్న కొందరు జర్నలిస్టులకు, మరికొందరికి మూడు సంవత్సరాల కాఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. కాగా.. ఏదైనా పలహారం దొరుకుతే అందరూ సమాపారంలో పంచుకొని తింటారు. కానీ లాభం నాకు కష్టం మీకు అని అన్నట్టు వ్యవహరించి, పోలీసులకు దొరికినా కూడా చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకున్న ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఒక రిపోర్టర్ తీరు జిల్లాలో చర్చనీయాంశమైంది....

పూర్తి కథనం రేపటి వాస్తవ నేస్తం దినపత్రికలో
Comments
 -Advertisement-