-Advertisement-

విన్నర్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి

Vaasthava Nestham

- టీజీవీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొట్టూరి ప్రవీణ్ కుమార్ డిమాండ్


వాస్తవ నేస్తం,నిర్మల్: ప్రభుత్వ నిబంధనలు పాటించని జిల్లా కేంద్రంలోని విన్నర్ హై స్కూల్ పై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొట్టూరి ప్రవీణ్ కుమార్ విద్యాశాఖ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... విన్నర్ హై స్కూల్ యజమాన్యం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్లో ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే విద్యాశాఖ అధికారులు స్కూల్ పై చర్యలు తీసుకోవాలన్నారు లేనియెడల టీజీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ పట్టణ కన్వీనర్ జుమెరాజ్ సాయిచరణ్, టీజీవిపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments
 -Advertisement-