ప్రశ్నించే గొంతుక.. పార్లమెంట్ వైపు పయనం
By
Vaasthava Nestham
- నాడు ప్రజా సమస్యలపై కలంతో గళం
- నేడు ప్రజా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్ సమరానికి సై
- మెదక్ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ అన్నెల లక్ష్మణ్ పోటీ
- ధర్మ సమాజ్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి
- ఊరురా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
- ప్రశ్నించే గొంతుకలు పార్లమెంట్'లో ఉండాలంటున్నా విద్యావేత్తలు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: ఆయన ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ప్రజా సమస్యలపై ప్రశ్నించడంలో కలం వీరుడు. దశాబ్ద కాలం పాటు జర్నలిస్టుగా వివిధ దినపత్రికల్లో పనిచేసి ప్రజా సమస్యల పైన తన గళాన్ని వినిపించాడు. ప్రశ్నిస్తే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనే నినాద స్ఫూర్తితో ఇటీవల జరగనున్న పార్లమెంట్ సమరానికి మెదక్ పార్లమెంట్ నుండి ఎంపీగా పోటీ చేయడానికి సై అంటున్నాడు జర్నలిస్ట్ అన్నెల లక్ష్మణ్.. ఆదిలాబాద్ ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన అన్నెల లక్ష్మణ్ దశాబ్ద కాలం పాటు జర్నలిస్టుగా పనిచేసి తన కలం ద్వారా ఎన్నో ప్రజా సమస్యల లిఖించి పాలకులకు తెలిసేలా చేసి పరిష్కార మార్గాలు చూపారు.
ధర్మ సమాజ్ పార్టీలో కీరోల్...
బీసీ, బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు సమన్యాయం దక్కాలని, మైనార్టీలు కాదు మెజార్టీలు అని ధర్మ సమాజ్ పార్టీలో చేరి ఊరూరు, వాడ వాడ తిరుగుతూ ధర్మసమాజ్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేస్తూ, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో అన్నెల లక్ష్మణ్ కీరోల్'ను ప్రదర్శిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలు పార్లమెంట్లో ఉండాలని పలువురి విద్యావంతుల సూచన మేరకు మెదక్ పార్లమెంట్ నుండి ధర్మ సమాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అన్నెల లక్ష్మణ్ బరిలో ఉన్నారు. ఉన్నత విద్యావంతుడు, పేదల సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుక అవ్వడంతో అన్నెల లక్ష్మణ్ కు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రజలు ఊరూర బ్రహ్మరథం పడుతున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం చుట్టేస్తూ ఊరు ఊరు, గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. దీంతో అన్నెల లక్ష్మణ్ ప్రత్యర్థి పార్టీ ఎంపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు పార్లమెంట్ సెగ్మెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రశ్నించే గొంతుక, ప్రజా సమస్యలపై గళం విప్పే గొంతుక అన్నెల లక్ష్మణ్ గురించి పార్లమెంట్ సెగ్మెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రశ్నించే గొంతుకలనే పార్లమెంటుకు పంపితే పేదల పక్షాన గళం విప్పుతారని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
Comments