-Advertisement-

అయ్యో పాపం... తండ్రిని కాపాడబోయి బిడ్డ మృత్యు ఒడిలోకి..

Vaasthava Nestham

- ఎండలకు తట్టుకోలేక గోదావరి నదిలో స్నానానికి దిగిన తండ్రి
- ఈత రాక మునిగిపోతుండటంతో ఒడ్డు నుంచి చేయి అందించి బయటికి లాగిన కుమార్తె
- కాలుజారడంతో నీళ్లలో పడి బాలిక మృతి
– ములుగు జిల్లాలో విషాదం


వాస్తవ నేస్తం,ములుగు: తండ్రిని కాపాడబోయి ఓ బిడ్డ మృత్యు ఒడిలోకి చేరింది. గోదావరి నదిలో తండ్రి స్నానం సరదా కుమార్తె ప్రాణం తీసింది. నీటి లోతు ఎక్కువ ఉండటంతో కండ్లముందే తండ్రి మునిగిపోతుంటే గమనించిన కుమార్తె ఒడ్డుపై నుంచి చేయి అందించి బయటికి లాగింది. ఈ క్రమంలో కాలు జారి ఆ బాలిక నదిలో పడి మృతి చెందింది.ఈ విషాద ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలో జరిగిది. ములుగు జిల్లాలో ఎండలకు తట్టుకోలేక కమలాపురానికి చెందిన రాజేందర్ తన కుమార్తె నిఖిత(14)తో కలిసి సోమవారం గోదావరి ఒడ్డుకు వెళ్లాడు. రాజేందర్ స్నానం చేసేందుకు నదిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఈతరాక నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న అతడి కుమార్తె వెంటనే తేరుకుని తండ్రిని కాపాడేందుకు చేయి అందించి బయటికి లాగింది. ఈ క్రమంలో బండమీద నుంచి ఉన్న నిఖితకు కాలుజారడతో ఆమె ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. రాజేందర్ ప్రాణాలతో బయటపడగా.. నిఖిత చనిపోయింది. బిడ్డ మృతితో రాజేందర్ దంపతుల రోదనలు మిన్నంటాయి. తండ్రిని కాపాడి కుమార్తె చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
 -Advertisement-